టాలివుడ్ డ్యాన్స్ మాస్టర్ రాకేష్ మాస్టర్ ఇటీవలే అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే..చిత్ర పరిశ్రమతో పాటు రాకేష్ మాస్టర్ శిష్యులు, ఆయనతో పరిచయమున్నవారు షాక్‌కి గురయ్యారు. ఆయన శిష్యులు అయిన శేఖర్ మాస్టర్, జానీ, గణేష్ మాస్టర్స్ పాడె మోసి గురువు రుణం తీర్చుకున్నారు. ఇటీవల ఏర్పాటు చేసిన రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఆయన ప్రియ శిష్యులు శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ పాల్గొని.. ఎమోషనల్ అయ్యారు. రాకేష్ మాస్టర్ పెద్దకర్మలో భాగంగా ఆయన భార్య, కొడుకు, కూతురు పాల్గొన్నారు. ఈ సంతాప సభలో సినీ పరిశ్రమ నుంచి ప్రముఖ దర్శక, నిర్మాత వైవీఎస్ చౌదరి హాజరయ్యారు..
ఆయన సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలు మరువలేనివి.. ఒకటి రెండు కాదు.. ఏకంగా 1500 సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేసాడు..శేఖర్ మాస్టర్ తో విభేదాలు వచ్చిన సంగతి తెలిసిందే.. అయిన శేఖర్ మాస్టర్ అంత్యక్రియలు దగ్గరుండి చేశారు.. ఆయన పేరిట ప్రతి సంవత్సరం జాతీయ పురస్కారాన్ని నెలకొల్పనున్నారు. ఎంతోమంది ఔత్సాహికులకు డ్యాన్స్ నేర్పించి ప్రయోజకులను చేసిన రాకేష్ మాస్టర్ ని ఎప్పుడూ మర్చిపోకుండా ఉండటానికి శేఖర్ మాస్టర్, సత్య మాస్టర్ ఈ జాతీయ పురస్కారాన్ని ప్రతి ఏటా అందించడానికి సిద్దమయ్యారు. ఈ సందర్భంగా తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా టెక్నిషియన్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ నాగబాల సురేష్ కుమార్ బుధవారం హైదరాబాద్‌లో రాకేష్ మాస్టర్ సంతాప సభలో ఈ విషయాన్ని ప్రకటించారు..
ఇది ఇలా ఉండగా… మాస్టర్ చనిపోయి చాలా రోజులు అయ్యింది.. శేఖర్ మాస్టర్ రాకేష్ మాస్టర్ పేరు వినగానే కన్నీళ్లు పెట్టుకున్నాడు..ఢీ షోలో రాకేష్ మాస్టర్ పాత వీడియో ప్లే చేశారు. శేఖర్ మాస్టర్ ఆయన గురించి చెప్తూ కాళ్లు మొక్కిన వీడియో చూసి ఎమోషనల్ అయ్యారు. యాంకర్ ప్రదీప్ ‘ఈ షో ఎంతో మంది గురువుల్ని పరిచయం చేసింది.. ఎంతో మంది శిష్యుల్ని ఆ గురువుకి పరిచయం చేసింది. గురువు గారైన రాకేష్ మాస్టర్‌ని అందరం కోల్పోయాం’ అనగానే.. శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ‘మాస్టర్ గారితో 7, 8 సంవత్సరాల జర్నీ. చాలామంది తెలిసీ తెలియక మాట్లాడుతుంటే చాలా బాధవుతుంది.. ఆయన దీవెనలు మాకు ఎప్పుడూ ఉంటాయి.. అంటూ కంటతడి పెట్టుకున్నాడు.. అందుకు సంబందించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది..