టాలివుడ్ హీరో శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.. ఈ ఏడాది జనవరి 26న రక్షిత అనే సాఫ్ట్ వేర్ ఇంజినీర్ తో శర్వా నిశ్చితార్థం చేసుకున్నాడు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఎంగేజ్మెంట్ కు టాలివుడ్ సినీ జనం మొత్తం హాజరైంది..ఆ ఫొటోలో నెట్టింట బాగా వైరల్ అయ్యాయి. నిశ్చితార్ధం జరిగిన ఆరు నెలలు తరువాత ఇప్పుడు వీరిద్దరూ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారు. జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా అండ్ రక్షిత వివాహం జరగబోతుంది.. ఈ వివాహ సంబరాలు ఈరోజు రేపు జరగనున్నాయి..

ప్రస్తుతం వివాహ వేడుకలకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మెహందీ ఫంక్షన్, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుని చేయడం, పలు కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇక ఈ ఫంక్షన్ లో శర్వానంద్ ఫామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. హల్దీ వేడుకలో పసుపు రాసుకుంటూ సందడి చేస్తున్న శర్వానంద్ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈరోజు సాయంత్రం 5గంటలకు మెహందీ కార్యక్రమం, రేపు ఉదయం 11గంటలకు పెళ్లి కొడుకు వేడుక జరగనుంది. రేపు రాత్రి 11 గంటలకు వీరిద్దరి వివాహం జరగబోతుంది అని తెలుస్తుంది. ఇక ఈ మ్యారేజ్ కి టాలీవుడ్ నుంచి సెలబ్రెటీస్ ఎవరెవరు హాజరవుతున్నారు అనే దానిపై అభిమానుల్లో ఆసక్తి మొదలైంది..
అలాగే రక్షిత రాజకీయ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కుటుంబం కావడంతో పొలిటికల్ లీడర్స్ కూడా పెళ్ళికి వచ్చే అవకాశం ఉంది. ఇక శర్వా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం తన 35వ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. మొన్నటి వరకు ఈ మూవీ షూటింగ్ ఫారిన్ లో ఏకధాటిగా జరిగింది. ఈ పెళ్లి వల్ల కొన్ని రోజులు షూటింగ్ కి బ్రేక్ ఇచ్చాడు.. పెళ్లి తర్వాత వెంటనే సినిమాను పూర్తి చేసి జనాల్లోకి తీసుకురావాలని భావిస్తున్నారు మేకర్స్..మొత్తానికి శర్వా రేపటితో ఓ ఇంటివాడు కాబోతున్నాడన్నమాట…