సమంత లేటెస్ట్ ఫొటో చూశారా.. ట్రైనర్ తో కలిసి జిమ్ చేస్తూ..

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ బ్యూటీ అందం, అభినయానికి యావత్ సౌత్ ఇండియా ఎప్పుడో ఫిదా అయింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ తో నార్త్ ఇండియా కూడా సామ్ అంటే పడి చస్తోంది. అందుకే బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తున్న సిటడెల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని హిందీ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చేస్తోంది. ఇంతటి పాపులారిటీ సామ్ కు అంత ఈజీగా ఏం రాలేదు మరి. ప్రతి పాత్ర కోసం సమంత ఎంతో కష్టపడింది.

samantha
samantha

ముఖ్యంగా తన అందం కోసం, ఫిట్ నెస్ కోసం సామ్ ఎంత కష్టపడుతుందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఫిట్ గా ఉంటడానికి సామ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. కరెక్ట్ గా డైట్ పాటిస్తూ.. క్రమం తప్పకుండా జిమ్ చేస్తూ ఫిట్ నెస్ ను కాపాడుకుంటుంది. అయితే సాధారణంగా హీరోయిన్లంతా నార్మల్ గా కార్డియో లాంటి కసరత్తులు చేస్తే.. సమంత మాత్రం వెయిట్ లిఫ్టింగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలా వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల బాడీకి స్టామినా వస్తుందని చెబుతూ ఉంటుంది ఈ బ్యూటీ.

ఇప్పటికే పలుమార్లు జిమ్ లో వెయిట్ లిఫ్ట్ చేస్తూ ఫొటోలు పోస్టు చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఏకంగా 100 కిలోల బరువును సునాయాసంగా ఎత్తింది. ఆ వీడియో అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక తరచూ తను జిమ్ లో కసరత్తు చేస్తూ ఫొటోలు పెడుతూ ఉంటుంది. మయోసైటిస్ తో బాధ పడుతున్నప్పుడు కూడా సామ్ తన ఫిట్ నెస్ ట్రైనింగ్ వదల్లేదు. ఇంకా ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకుని త్వరగా ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకుంది.

- Advertisement -
samantha

అయితే సమంత లేటెస్ట్ గా జిమ్ లో కసరత్తు చేస్తున్న ఫొటో పంచుకుంది. ఈ ఫొటోలో సామ్ తన ట్రైనర్ తో కలిసి పోజులిచ్చింది. తన కండలు చూపిస్తూ ఫొటో దిగింది. ఈ ఫొటోలో సామ్ కండలు చూస్తుంటే.. ఈ మాత్రం ఫిట్ నెస్ రావడానికి ఈ బ్యూటీ ఎంత కష్టపడిందో అర్థమవుతుంది. ప్రస్తుతం సామ్ లేటెస్ట్ ఫొటో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. 

ఈ ఫొటో చూసి సామ్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అంత బిజీ షెడ్యూల్ లో కూడా జిమ్ చేస్తూ సామ్ ఇన్స్పైర్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు. మరికొందరేమో.. కండల మండేలా లాగా.. కండల సమంత అంటూ నాటీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సామ్ ప్రస్తుతం బాలీవుడ్ లో సిటడెల్, చెన్నై స్టోరీ అనే హాలీవుడ్ మూవీ, తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి మూవీలో నటిస్తోంది. ఖుషి మూవీలో సమంతను చూసేందుకు.. సమంత, విజయ్ ల మ్యాజిక్ చూసేందుకు టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీని పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారట. అలా అయితే సమంత ముంబయి ఫ్యాన్స్ సిటడెల్ కంటే ముందే సామ్ మ్యాజిక్ ను చూసేస్తారన్నమాట.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here