‘భోళా శంకర్’ టైటిల్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..మెగాస్టార్ మాస్ కి మరోసారి రికార్డ్స్ బ్లాస్ట్ అవ్వాల్సిందే!

- Advertisement -

‘వాల్తేరు వీరయ్య’ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న చిత్రం ‘భోళా శంకర్’ . మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ఫ్యాన్స్ లో మొదటి నుండి అంచనాలు పెద్దగా లేవు. ఎందుకంటే ఈ సినిమా తమిళం లో 7 ఏళ్ళ క్రితం విడుదలైన అజిత్ ‘వేదలమ్’ చిత్రానికి రీమేక్. ప్రస్తుతం నడుస్తున్న ఓటీటీ కాలం లో రీమేక్ సినిమాలు పెద్దగా ఆడడం లేదని విశ్లేషకులు చెప్తూనే ఉన్నారు.

భోళా శంకర్
భోళా శంకర్

అందుకే ఫ్యాన్స్ ఈ చిత్రాన్ని ఆపేయాలంటూ అప్పట్లో ట్రెండ్ కూడా చేసారు, పైగా మెహర్ రమేష్ లాంటి డిజాస్టర్ డైరెక్టర్ మీద నమ్మకాలూ లేవంటూ కామెంట్స్ చేసారు. అయితే ఆ తర్వాత ఈ సినిమా నుండి వస్తున్న పోస్టర్స్ ని చూసి ఫ్యాన్స్ లో అంచనాలు మెళ్లిగా ప్రారంభం అయ్యాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ చిత్రం లోని మూడు పాటలు అదిరిపోయాయని టాక్.

మణిశర్మ కొడుకు మహతి సాగర్ ఈ సినిమాకి సంగీతం అందించాడు. అందులోని మొదటి పాట ‘భోళా మేనియా’ కి సంబంధించిన ప్రోమో ని కాసేపటి క్రితమే విడుదల చేసింది మూవీ టీం. ప్రోమో లో పాటకి సంబంధించి ఒక్క లిరిక్ కూడా విడుదల చెయ్యలేదు కానీ, మెగాస్టార్ స్టైల్ గా ఫోజులు ఇస్తూ సాంగ్ లో కనిపించిన స్టిల్స్ కి ఫ్యాన్స్ నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ వచ్చింది.పూర్తి పాట నాల్గవ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు ఈ ప్రోమో చివర్లో తెలిపారు.

- Advertisement -

పేరు కి రీమేక్ అయ్యినప్పటికీ కూడా తెలుగు ఆడియన్స్ మరియు మెగాస్టార్ చిరంజీవి బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ మెహర్ రమేష్ తీర్చి దిద్దారని, కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి చిరంజీవి వంద కోట్ల రూపాయిల షేర్ కొల్లగొడతాడని అంటున్నారు ఫ్యాన్స్. మరి వారి నమ్మకాలను ఈ సినిమా ఎంత వరకు నిలబెడుతుందో తెలియాలంటే ఆగష్టు 11 వరకు వేచి చూడాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here