ట్రిపుల్ ఆర్ సినిమాతో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఆయన క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. రామ్ చరణ్ ఇటీవల తండ్రి అయిన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి ఉపాసన జూన్ 20న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లి జరిగిన 11 ఏళ్ల తర్వాత రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులు కావడంతో కుటుంబంలో ఆనందానికి అవధుల్లవు. ప్రస్తుతం బేబీ తో ఈ లవ్లీ కపుల్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు. ఇటీవలే ఆయనకు పుట్టిన పాప చాలా అదృష్టవంతురాలని వార్తలు వినిపించాయి. అలాగే పాప పుట్టిన వేళా విశేషమేమో గానీ రామ్ చరణ్ కు వరుసగా అదృష్టం వెంటాడుతోంది. తాజాగా ఆయనకు ఆస్కార్ సభ్యత్వ ఆహ్వానాన్ని అకాడమీ నుంచి అందుకున్నారు.

అయితే నేడు మెగా లిటిల్ ప్రిన్సెస్ బారసాల వేడుక ఘనంగా జరిగింది. చిన్నారికి క్లిన్ కారా కొణిదెల అని నామకరణం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ వార్త తెరపైకి వచ్చింది. రామ్ చరణ్ కూతురు కోసం యంగ్ హీరో శర్వానంద్ ప్రత్యేక బహుమతి పంపాడట. రామ్ చరణ్, శర్వానంద్ చిన్ననాటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే. మెగా ఫ్యామిలీతోనూ శర్వానంద్ కి మంచి సంబంధాలున్నాయి. రీసెంట్ గా జరిగిన శర్వానంద్ పెళ్లి, రిసెప్షన్ వేడుకల్లో కూడా రామ్ చరణ్ దంపతులు కూడా సందడి చేశారు. ఇక శర్వానంద్ రామ్ చరణ్ పై తన ఫ్రెండ్షిప్ ను మరోసారి రుజువు చేసుకున్నాడు. రామ్ చరణ్ కూతురి కోసం ఖరీదైన బ్రాండెడ్ బేబీ ప్రొడక్ట్స్ గిఫ్ట్ ఇచ్చాడట. అలాగే పాపకు దుస్తులు, బొమ్మలు పంపించాడట. అంతేకాదు చిన్నారి కోసం లక్ష్మీదేవి లాకెట్ ఉన్న గోల్డ్ చైన్ ను బహుమతిగా ఇచ్చాడట. ఇక శర్వానంద్ ఇచ్చిన ఈ సర్‌ప్రైజింగ్ గిఫ్ట్స్ చూసి రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఎంతగానో ఆనందించారని నెట్టింట్లో వార్తలు గుప్పుమంటున్నాయి.
