Nayantara – విఘ్నేశ్ శివన్‌ని ఉద్దేశిస్తూ ఆసక్తికర ట్వీట్ చేశారు బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్. నయన్‌తో జాగ్రత్తగా ఉండు.. కొట్టడంలో ఆమె కొత్త టెక్నిక్స్ నేర్చుకున్నారంటూ విఘ్నేశ్‌కు ఆయన సూచించారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. అయితే, ఆయన ఈ ట్వీట్ చేయడానికి కారణం ఏమిటంటే. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, నయనతార కలిసి జవాన్ సినిమా ట్రైలర్ మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

ప్రస్తుతం ఈ ట్రైలర్ మీడియాను షేక్ చేస్తోంది. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ల లోను ప్రస్తుతం జవాన్ ట్రెండింగ్ లో ఉంది. ఈ సినిమా సెప్టెంబర్ 7వ తేదీన థియేటర్లలో విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేస్తున్న షారుఖ్ ఖాన్ అంటూ ఫ్యాన్స్ తో ఈ సినిమాకు సంబంధించి మాట్లాడుతున్నారు. తనను ఆదరిస్తున్న అందరికీ ధన్యావాదాలు చెప్తున్నారు. అందరికీ ధన్యవాదాలు తెలిపిన షారుక్ ఖాన్ తాజాగా నేను ఎవరు? ఎవరిని కాను ? తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అంటూ జవాన్ సినిమా కు సంబంధించిన ప్రివ్యూ వచ్చేసిందని ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు.

ఇక తాజాగా షారుఖ్ ఖాన్ ట్విట్టర్ లో నయనతార భర్త విఘ్నేష్ శివన్ జవాన్ సినిమా గురించి రాసిన ఒక స్వీట్ నోట్ కు రిప్లై ఇస్తూ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. నయనతార అద్భుతమని చెప్పిన షారుక్ ఖాన్ అయినా నేను ఎవరికి చెబుతున్నాను.. ఈ విషయాన్ని, భర్తగా మీకు ముందే తెలుసు అంటూ పేర్కొన్నారు. కానీ భర్తగా మీరు జాగ్రత్తగా ఉండాలని, నయనతార ఇప్పుడు కొన్ని మేజర్ కిక్ లు, పంచ్ లు నేర్చుకుంది అంటూ షారుక్ ఖాన్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఇక ఆ ట్వీట్ కు సమాధానంగా విఘ్నేష్ శివన్ అవును సార్ చాలా జాగ్రత్తగా ఉన్నానంటూ పేర్కొన్నారు. షారూక్ ఖాన్ చేసిన ట్వీట్ పట్ల సంతోషం వ్యక్తం చేశారు.