Simran : ఈ వయస్సులో కూడా డ్యాన్స్ అదరగొట్టిన సిమ్రాన్.. మేడం సార్ మేడం అంతే..

- Advertisement -

Simran : ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ముద్దుగుమ్మ సిమ్రాన్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సీనియర్ హీరోల అందరి సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.. ఈ మధ్య సినిమాలకు దూరంగా ఉన్న కూడా సోషల్ మీడియాలో మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది.

simran
simran

వరుస ఫొటోలతో పాటు.. ఈ వయస్సులో కూడా డ్యాన్స్ ఆదరగోడుతూ వీడియోలను నెట్టింట అభిమానులతో షేర్ చేస్తుంది.. తాజాగా తమన్నా సాంగ్ కు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ డ్యాన్స్ చేసిన వీడియోను షేర్ చేసింది.. అది కాస్త నెట్టింట వైరల్ అవుతుంది..

సిమ్రాన్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వయసులోనూ దుమ్ము దులిపేసేలా డ్యాన్స్ చేశారు. ‘47 ఏళ్ల ఏజ్‌లోనూ అదరగొట్టేశారు.. డ్యాన్స్‌లో మీకు మీరే పోటీ, మీకెవరూ రారు సాటి’ అంటూ ఫ్యాన్స్, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -
simran dance video

దీంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాలాలో తెగ చక్కర్లు కొడుతుంది.. ఒరిజినల్ గా తమన్నా చేసినా కూడా సిమ్రాన్ వేసిన స్టెప్పులతో జనాలు ఒరిజినల్ సాంగ్ ను మర్చిపోయారు.. అంత అద్భుతంగా చేసి కుర్రకారును మరోసారి ఊర్రుతలూరించింది.. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది..

సిమ్రాన్ తెలుగు, తమిళం సినిమాలలో పేరొందిన కథానాయిక. ఉత్తరాదికి చెందిన ఈమెను తెలుగులో మొదటగా దర్శకుడు శరత్ తన చిత్రం అబ్బాయిగారి పెళ్లి ద్వారా పరిచయం చేసాడు. ఈమె పలు తమిళ, తెలుగు, హిందీ, మలయాళం సినిమాలలో నటించింది.తెలుగులో 1999 నుంచి 2004 వరకు అగ్రకథానాయకగా కొనసాగింది.. అందం అభినయంతో పాటు హీరోకు ఏమాత్రం తగ్గకుండా డాన్సులు చేసేది సిమ్రాన్. వైవియస్ చౌదరి దర్శకత్వంలో వచ్చిన సీతయ్యలో సిమ్రాన్ గ్లామర్ లుక్ మరో లెవల్లో ఉంటుంది. అయితే ఆ సినిమా తర్వాత అవకాశాలు తగ్గడంతో అడపాదడపా నటిస్తూ హీరోయిన్ గా రిటైర్ అయ్యింది. కాగా ఇటీవలే సిమ్రాన్ తన 47వ పుట్టినరోజును జరుపుకుంది..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here