Shannu Deepthi : షణ్ముఖ్ జస్వంత్ దీప్తి సునయన లకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూట్యూబ్ క్రియేటర్లుగా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు సెలబ్రిటీ హోదాని దక్కించుకున్నారు.. వారి టాలెంట్ తో ఫేమస్ కావడమే కాదు. ఆర్థికంగానూ బానే సంపాదిస్తున్నారు. వీళ్ళిద్దరూ గతంలో ప్రేమించుకున్న సంగతి తెలిసిందే .. వీళ్ళ జంటకు వీళ్లు చేసే కవర్ సాంగ్స్, కపుల్ షోస్, వీడియో సాంగ్స్ అంత క్రేజీ ఉండేవి.. కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత వారి మధ్య రిలేషన్ దెబ్బతినింది..

బిగ్ బాస్ నుంచి షణ్ముఖ తిరిగి వచ్చిన తర్వాత తామిద్దరం విడిపోతున్నాం అంటూ ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు.. అందుకు బిగ్ బాస్ హౌస్ లో సిరి తో షణ్ముఖ్ క్లోజ్ గా ఉండటమే కారణమని అందరికీ తెలిసిన విషయమే. ఆ సమయంలో వాళ్ళిద్దరూ కలిసిపోవాలని.. కలిసే ఉండాలంటూ వారి ఫ్యాన్స్ ఎంతోమంది పోస్టులు కామెంట్స్ చేశారు.. సుమారు ఐదేళ్లపాటు వీరిద్దరూ ప్రేమలో మునిగితేలారు. అయితే ఈ జంట విడిపోయి ఇప్పటికే ఏడాది దాటిపోయింది.. తాజాగా బ్రేకప్ తర్వాత సునయన క్రేజీ కామెంట్స్ చేసింది. షన్నుతో రిలేషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే దీప్తి సునయన బ్రేకప్ విషయంపై తాజాగా ఓపెన్ అయింది. అభిమానులతో నిర్వహించిన చిట్ చాట్ లో తన ఫాలోవర్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని ఆసక్తికరమైన ప్రశ్న వేశారు. బ్రేకప్ తర్వాత నీలో వచ్చిన మార్పు ఏంటి.? అని నెటిజన్ ప్రశ్నించగా.. రోజురోజుకు రోబోలో తయారవుతున్న అంటూ సమాధానం చెప్పింది దీప్తి .
మరో నేటిజన్ ప్రశ్నిస్తూ.. ఓ వ్యక్తిని మీ జీవితంలో ఆహ్వానించాలంటే.. అతనిలో మీరేం చేస్తారు ఎంత సమయం తీసుకుంటారు అని అడగ్గా.. నన్ను నవ్విస్తే చాలు అంటూ సమాధానం ఇచ్చింది దీప్తి సునయన. ఆ తర్వాత అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు జవాబులు ఇచ్చింది దీప్తి సునయన.
దాంతో ఇది చర్చనీయాంశం అవుతుంది. షన్ను తనని బాగా నవ్వించేవాడని.. ఇప్పుడు నవ్వు లేక రోబోలో వర్క్ చేసుకుంటూ వెళ్తుందా అని అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. అంతేకాదు వీళ్ళిద్దరూ మళ్లీ కలుసుకోవాలని కోరుకుంటున్నారు. మరి అభిమానుల కోరికను వీళ్లు ఇద్దరూ నెరవేరుస్తారా లేదా అనేది చూడాలి. ఇటీవల ఓ ఈవెంట్ లో పాల్గొన్న ఇద్దరు ఒకరినొకరు చూసుకొని స్మైల్ ఇచ్చుకోవడం హాట్ టాపిక్ అయినా సంగతి తెలిసిందే.. ప్రస్తుతం షణ్ముఖ దీప్తి ఎవరికి వారు కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు.