Shalini Pandey : లిప్​స్టిక్ పెట్టుకుంటున్న ఈ క్యూటీపై ఇప్పుడో స్టార్ హీరోయిన్​.. గుర్తుపట్టారా..?

- Advertisement -

Shalini Pandey : ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్​గా ఉంటున్నారు సెలబ్రిటీలు. ముఖ్యంగా హీరోయిన్లు సోషల్ మీడియాలో యమా జోష్​ చూపిస్తున్నారు. ప్రతి రోజు ఉదయం లేవగానే మొదలుపెట్టి.. మిడ్ నైట్ వరకు తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఫ్యాన్స్​తో షేర్ చేసుకుంటున్నారు. ఓవైపు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్.. మరోవైపు బ్రాండ్ ప్రమోషన్స్.. ఇంకోవైపు తమ పర్సనల్ విషయాలు అభిమానులతో పంచుకుంటున్నారు.

Shalini Pandey
Shalini Pandey

ఇక హీరోయిన్ల వరుస ఫొటోషూట్​లకు అడ్డూ అదుపూ లేదు. తరచూ ఏదో ఒక ఈవెంట్, బ్రాండ్ ప్రమోషన్స్, మూవీ ప్రమోషన్​ కోసం ఫొటోషూట్స్ చేస్తూనే ఉంటారు. ఈ ఫొటోలను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేసి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంటారు.

Shalini Pandey  photos

అయితే సోషల్ మీడియాలో అప్పుడప్పుడు రకరకాల ట్రెండ్స్ నడుస్తూ ఉంటాయి. కొన్నిసార్లు త్రో బ్యాక్ ఫొటోలని.. మరికొన్ని సార్లు ట్రెడిషన్ వేర్ ఫొటో పోస్టింగ్ అని.. ఇంకొన్ని సార్లు ట్రెండీ వేర్ పోస్టులను.. బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ పోస్టింగ్ అని.. ఇలా రకరకాల ట్రెండ్స్​ తెరతీస్తుంటాయి.

- Advertisement -

రీసెంట్​గా సోషల్ మీడియాలో నడుస్తున్న ట్రెండ్ త్రో బ్యాక్ ఫొటోస్ ట్రండ్. ఈ ట్రెండ్​లో సినీ తారలు తమకు సంబంధించిన గతంలో ఫొటోలను షేర్ చేస్తున్నారు. ముఖ్యంగా కొందరు హీరోయిన్లయితే తమ చిన్న నాటి ఫొటోలు షేర్ చేసి అభిమానులను ఖుష్ చేస్తున్నారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ వాటి గురించి తమ ఫ్యాన్స్​కు చెబుతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా చాల మంది స్టార్ హీరోహీరోయిన్ల ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

సెలబ్రిటీలు వారి చిన్ననాటి ఫొటోలు పోస్టు చేయడం ఆలస్యం తెగ వైరల్ అయిపోతాయి. ముఖ్యంగా వారి ఫ్యాన్స్ వాటిని బాగా వైరల్ చేస్తారు. రీసెంట్​గా టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే బ్లాక్​బస్టర్ హిట్​ కొట్టి.. ఆ తర్వాత బాలీవుడ్​లో ఛాన్స్ కొట్టేసిన ఓ బ్యూటీ తన చిన్ననాటి ఫొటో షేర్ చేసింది. ఈ క్యూటీ తన చిన్నప్పటి ఫొటో పోస్టు చేయగానే క్షణాల్లో వైరల్ అయిపోయింది. ఆ ఫొటోలో ఆ చిన్నారి లిప్ స్టిక్ వేసుకుంటూ క్యూట్ గా తన అందాన్ని అద్దంలో చూసుకుంటోంది.

ఈ ఫొటోలో ఉన్న హీరోయిన్ ఎవరో కాదు తెలుగు చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న షాలినీ పాండే. విజయ్ దేవరకొండకు జోడిగా నటించి అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్​లో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన అందం, నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఫస్ట్ మూవీలోనే తనకు భాష రాకపోయినా డబ్బింగ్ చెప్పుంది. ప్రీతిగా ప్రతి తెలుగు యువకుడి గుండెలో చెరగని ముద్ర వేసింది.

అర్జున్ రెడ్డి తర్వాత కూడా 118, 100 % కాదల్, నిశ్శబ్దం వంటి తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ప్రస్తుతం షాలినీ పాండే హిందీలో రెండు సినిమాలు చేస్తోంది. ఇప్పటికే జయేశ్ భాయ్ జోర్దార్ మూవీతో ఫస్ట్ సినిమాలోనే రణ్​వీర్ సింగ్ పక్కన నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ తర్వాత మహారాజ అనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ క్యూటీ.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here