Ravi Teja : మంచి మనసున్న మహరాజు రవితేజ.. ఖరీదైన గిఫ్ట్ ఇచ్చి..

- Advertisement -

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు సీనియర్ హీరో మాస్ మహరాజా రవితేజ ( Ravi Teja ).. సినిమాలు ప్రేక్షకులను అలరించలేకున్నా కూడా ఆయన చేస్తున్న మంచి పనులు మాత్రం యావత్ తెలుగు ప్రేక్షకుల మనసును తాకుతున్నాయి.అందుకే ఆయన మనసు దొచుకున్న హీరో అయ్యాడు..తన దగ్గర పని చేస్తున్న వారి బాగోగులను చూసుకోవడం తన బాధ్యత అని చాలా సందర్భాల్లో రుజువైంది..ఇప్పుడు మేనేజర్ కు కారు గిఫ్ట్ గా ఇచ్చి అతడిని సంతోషపరిచాడు..

స్టార్స్ దర్శకులకు, తమ చిత్రయూనిట్ కు గిఫ్ట్ ఇవ్వడం ఈ మధ్య చాలా చూస్తున్నాం. మొన్నామధ్య అల్లు అర్జున్ పుష్ప టీమ్ కు గిఫ్ట్స్ ఇచ్చాడు.. అలాగే చరణ్ కూడా ఆచార్య టీమ్ కు గిఫ్ట్స్ ఇచ్చాడు.ఆ తర్వాత కొంతమంది బడా ప్రొడ్యూసర్లు దర్శకులకు గిఫ్ట్స్ ఇవ్వడం కూడా చూశాం. ఇక హీరోలు కూడా తమ దర్శకులకు.. తమ దగ్గర పని చేసే వారికి కూడా గిఫ్ట్స్ ఇచ్చారు. కాస్ట్లీ కార్లను గిఫ్ట్స్ గా ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. తాజాగా మాస్ మహారాజా ర వితేజ కూడా ఇప్పుడు మంచి మనసు చాటుకొని హాట్ టాపిక్ అయ్యారు.

ravi teja manager car
ravi teja manager car

రవితేజ తన దగ్గర ఎంతో కాలంగా పనిచేస్తున్న మేనేజర్ కు టాటా కంపెనీకి చెందిన కాస్ట్లీ కారును గిఫ్ట్ గా ఇచ్చాడు. దాంతో ఆ మేనేజర్ ఫ్యామిలీ ఆనందాన్ని వ్ వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆ మేనేజర్ తన ఫ్యామిలీతో కలిసి కారు వద్ద తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఆ కారులో ఫస్ట్ డ్రైవ్ రవితేజను కోరగా రవితేజ కారును డ్రైవ్ చేశారు..

- Advertisement -

మాస్ మహారాజ ల విషయాని కొస్తే ప్రస్తుతం రవితేజ బ్యాక్ టు బ్యాక్ లతో బిజీగా ఉన్నాడు. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య లో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అదేవిధంగా ధమాకా రిలీజ్ కు రెడీగా ఉంది. అలాగే రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు లు చేస్తున్నాడు..అయితే ఈ మధ్య క్రాక్ సినిమా తో హిట్ కొట్టిన రవితేజకు తర్వాత వచ్చిన సినిమాలు నిరాశను మిగిల్చాయి.. కనీసం కలెక్షన్స్ను కూడా అందుకోలేకపోయాయి.. ధమాకా సినిమా పై ఆశలు పెట్టుకున్నాడు.. ఈ సినిమా మరి కొద్ది రోజుల్లో విడుదల కానుంది..చూడాలి మరి ఎలా ఆకట్టుకుంటుందో..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here