Mohan Lal – Shah Rukh Khan : ప్లేస్ మీరు చెప్తారా? నన్ను చెప్పమంటారా?.. నెట్టింట మోహన్ లాల్, షారుక్ ఖాన్ రచ్చ

- Advertisement -

Mohan Lal – Shah Rukh Khan : సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే వేదికపై కనిపిస్తే అభిమానులకు పండగే. కానీ ఇప్పుడు అందరూ తమ షూటింగుల్లో బిజీబిజిగా ఉన్నారు. అయితే ఏ హీరో అయినా మంచి సినిమా తీసినా.. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ లో ఏదైనా సాధించినా.. నెట్టింట ఏదైనా హీరోకు సంబంధించిన మంచి వీడియో వైరల్ అయినా.. ఇతర నటులు వారిని కలిసి అభినందించలేక పోయినా.. సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. వాళ్లను అభినందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. యంగ్ హీరోలే కాదు.. ఆరు పదులు దాటిన సీనియర్ హీరోలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.

Mohan Lal - Shah Rukh Khan
Mohan Lal – Shah Rukh Khan

అలా రెండు సినిమా ఇండస్ట్రీలకు చెందిన సూపర్ స్టార్లు సోషల్ మీడియాలో కాసేపు ముచ్చటించుకున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరి కన్వర్జేషన్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరనేగా మీ సందేహం. ఇంకెవరు ఒకరు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.. ఇంకొంకరు మలయాళం సినిమా ఇండస్ట్రీ లాలెట్టా (విశ్వ నటుడు) మోహన్ లాల్. ఇంతకీ ఈ ఇద్దరు ఏం ముచ్చటించారంటే..?

ఇటీవల మోహన్ లాల్ ఓ ఈ వెంట్ లో షారుక్ ఖాన్ జవాన్ మూవీలోని జిందా బందా అనే పాటకు స్టెప్పులేశారు. ఆ వీడియో నెట్టింట సూపర్ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో కాస్త బాద్ షా దృష్టికి వెళ్లింది. దీంతో షారుక్ ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తూ.. మోహన్ లాల్ సార్ మీరు డ్యాన్స్ అదరగొట్టారు.. సూపర్ అంటూ ట్వీట్ చేశాడు. దానికి మోహన్ లాల్ రిప్లై ఇస్తూ.. మీ సాంగ్ కు మీకంటే బాగా ఎవరూ డ్యాన్స్ చేయలేరు.. మీరే బెస్ట్ అంటూ సమాధానమిచ్చారు. అంతే కాకుండా..  జిందా బందా బ్రేక్ ఫాస్ట్ చేద్దామా అంటూ మోహన్ లాల్ పోస్టు చేయడంతో షారుక్ స్పందిస్తూ..  “అలాగే సార్, ప్లేస్ మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా” అంటూ స్వీట్ రిప్లై ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఇద్దరు స్టార్ హీరోల ఫన్నీ సంభాషణ నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది.

- Advertisement -

ఇక షారుక్ ఇటీవలే జవాన్ తో సూపర్ సక్సెస్ కొట్టాడు. తాజాగా పఠాన్-2కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడనే వార్తలు వచ్చాయి. కానీ దాని గురించి అప్డేట్ ఏం రాలేదు. మరోవైపు మోహన్ లాల్.. మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కన్నప్ప ప్రాజెక్టులో నటిస్తున్నాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here