Besharam Rang : ‘బేషరమ్‌ రంగ్‌’ పై దుమారం.. షారుఖ్‌ ఖాన్ అదిరిపోయే కౌంటర్‌

- Advertisement -

Besharam Rang : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కు చాలా ఏళ్ల నుంచి సరైన హిట్ సినిమాలు లేవు. 2018లో వచ్చిన జీరో సినిమాయే షారుఖ్ లాస్ట్ మూవీ. ఆ సినిమా కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. జీరో మిగిల్చిన నిరాశతో షారుఖ్ ఇన్నాళ్లు ఏ మూవీకి ఓకే చెప్పలేదు. దాదాపు నాలుగేళ్ల తర్వాత షారుఖ్ మళ్లీ సినిమాలు చేస్తున్నాడు. ఒకటి కాదు ఏకంగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సిద్దార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో పఠాన్, అట్లీ దర్శకత్వంలో జవాన్ సినిమాలో నటిస్తున్నాడు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ – కత్రినా కైఫ్ కలిసి నటిస్తున్న టైగర్ 3లో అతిథి పాత్రలో మెరవనున్నాడు.

షారుఖ్ ఖాన్ – దీపికా పదుకొణె జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పఠాన్. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే షారుఖ్, దీపికా లుక్స్ మూవీ టీమ్ రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఫ్యాన్స్ కోసం బేషరమ్ రంగ్ అంటూ ఓ పాటను కూడా విడుదల చేసింది. ఈ సాంగ్ లో దీపిక బికినీలో అందాల విందు వడ్డించింది. కొన్ని చోట్ల మరీ వల్గర్ గా కనిపించింది అంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. షారుఖ్ సినిమాలో ఇలాంటి సీన్లు ఏంటని షాక్ అవుతున్నారు. దీనికి షారుఖ్ ఎలా ఒప్పుకున్నాడంటూ రచ్చ చేస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ సాంగ్. 

- Advertisement -
Besharam Rang
Besharam Rang song

తాజాగా ఈ సాంగ్ పై ఓ రాజకీయ నాయకుడు కూడా స్పందించారు. ఈ పాటలో వల్గారిటీని ఎడిట్ చేయకపోతే తమ రాష్ట్రంలో పఠాన్ మూవీని ప్రదర్శించనీయమని హెచ్చరించారు. సోషల్ మీడియాలో ఈ పాట దుమారం రేపుతోంది. ఓవైపు షారుఖ్ – దీపిక కెమిస్ట్రీని కొందరు పొగుడుతుంటే.. మరోవైపు వల్గర్ గా ఉందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఓ వైపు సోషల్ మీడియా దుమారం.. మరోవైపు రాజకీయ దుమారం.. ఇలా పఠాన్ కు తలనొప్పి తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ట్విటర్ లో బైకాట్ పఠాన్ అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఈ దుమారంపై కింగ్ షారుఖ్ ఖాన్ స్పందించాడు.

ప్రేక్షకులు, అభిమానులు తమని ప్రేమిస్తున్నంత కాలం ప్రపంచం ఏమనుకుంటుంది? ఏం చేస్తుందన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని, బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ అన్నాడు. పఠాన్ సినిమాకు సంబంధించి ‘బేషరమ్‌ రంగ్’ అంటూ సాగే ఓ పాటను విడుదల చేసింది చిత్ర బృందం. ఇందులో హాట్‌ హాట్‌ అందాలతో దీపిక నటించడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోల్‌కతా వేదికగా జరిగిన ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో షారుఖ్‌ మాట్లాడాడు.

‘‘సోషల్‌మీడియా కొన్నిసార్లు సంకుచిత దృష్టికోణంతో చూస్తూ ఉంటుంది. కొంతమంది ప్రవర్తన అంతే. సోషల్‌మీడియా వినియోగం వల్ల నెగెటివిటీ పెరుగుతుందని నేను ఎక్కడో చదివాను. అలాంటివి పనులు మనుషుల మధ్య విభేదాలు సృష్టించి, నాశనం చేస్తాయి. కోల్‌కతా ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లాంటివి సానుకూల దృక్పథాన్ని కల్పిస్తాయి’’ అని అన్నారు. ‘పఠాన్‌’ను బాయ్‌కాట్‌ చేయాలని, దీపిక పదుకొణె హాట్‌ సన్నివేశాలను సరి చేయాలని డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో షారుఖ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here