Prema : త్రివిక్ర‌మ్ మోసం చేశాడు.. సీనియర్ నటి సంచలన వ్యాఖ్యలు

- Advertisement -

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తనదైన డైలాగులతో టాలీవుడ్‌ని షేక్ చేస్తారు. ఇప్పటికే చాలా మంది హీరోలకు తమ కెరీర్‌లోనే బెస్ట్ డైలాగ్స్ ఇచ్చారు. తన మాటలతో డైరెక్షన్‌తో వెండితెరపై త్రివిక్రమ్ చేసే మ్యాజిక్‌కు తిరుగే లేదు. పాటలు బాగాలేకపోయినా.. కథ బాగా లేకపోయినా.. టేకింగ్ బాగాలేక పోయినా.. ఓ సినిమా బాగా ఆడిందంటే అందులో త్రివిక్రమ్ డైలాగ్స్ ఉన్నాయని అర్థం. ఆయన మాటల మాయ ఆ రేంజ్‌లో ఉంటుంది. అందుకే ఆయణ్ని మాటల మాంత్రికుడని టాలీవుడ్ పిలుచుకుంటుంది.

Prema
Prema

ఓవైపు యూత్.. మరోవైపు ఫ్యామిలీ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా సినిమాలు తీసే డైరెక్టర్లలో త్రివిక్రిమ్ ఒకరు. ముఖ్యంగా పంచ్ డైలాగ్స్‌కి త్రివిక్రమ్ పెట్టింది పేరు. ఆయన కలం నుంచి వచ్చే మాటల తూటాలకు సరైన హీరో దొరికితే థియేటర్లో పూనకాలే ఇక. అజాతశత్రువు అంటారు కదా.. సినిమా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ ఆ కోవకు చెందిన వారే.

అలాంటి త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఓ సీనియర్ హీరోయిన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఎవరో కాదు టాలీవుడ్‌లో దేవి అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ప్రేమ. హోమ్లీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రేమ తన అందం, అభినయంతో అందర్నీ అలరించింది. తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేమ డైరెక్టర్ త్రివిక్రమ్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

హీరో వేణు నటించిన చిరునవ్వుతో సినిమాలో ప్రేమ కీలక పాత్రలో నటించింది. బావతో పెళ్లి వద్దనుకుని ఒక మోసగాడితో వెళ్లిపోయిన పాత్రలో ప్రేమ నటన అందరినీ అలరించింది. ఈ మూవీలో ప్రేమది సపోర్టింగ్ క్యారెక్టర్. ఈ చిత్రానికి త్రివిక్రమ్ కథ అందించారు. ఈ పాత్రలో నటించేందుకు మొదట ప్రేమ ఆసక్తి చూపలేదట. కానీ త్రివిక్రమ్ తనది హీరోయిన్‌తో సమానమైన పాత్ర అని ప్రేమని ఒప్పించారట. త్రివిక్రమ్ మాటలను అంతగా నమ్మకపోయినా అనుమానంతో సినిమాకు ఓకే చెప్పారట ప్రేమ. తర్వాత సహాయ పాత్ర అని తెలిసినా.. ఇక మాట ఇచ్చానని నటించక తప్పలేదట. షూటింగ్‌కి ముందు ఒకలా చెప్పి సినిమాలో తన పాత్రను మరోలా చేశారని అన్నారు.

ఈ మూవీ తర్వాత కూడా తనకు అన్ని సపోర్టింగ్ రోల్సే వచ్చాయని ప్రేమ చెప్పారు. వాటికి నో చెప్పడంతో ఆ తర్వాత అవకాశాలే రాలేదన్నారు. కీలక దశలో ఉన్న తన కెరీర్ ఈ ఒక్క నిర్ణయం వల్ల నాశనం అయిందని ప్రేమ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కెరీర్ నాశనమవ్వడానికి ఒక రకంగా త్రివిక్రమ్‌ కారణమని ప్రేమ పరోక్షంగా వ్యాఖ్యలు చేశారని ఇండస్ట్రీలో టాక్.

ప్రేమ కెరీర్‌లో దేవి మూవీ ది బెస్ట్ సినిమా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రేమ నాగదేవతగా నటించారు. ఈ మూవీతో ప్రేమ టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యారు. కానీ ఆ తర్వాత ఎక్కువగా అవకాశాలు రాలేదు. ఇంతలోనే సపోర్టింగ్ రోల్ చేయడంతో ఇక అలాంటి పాత్రలే వచ్చాయి. ఆ తర్వాత అవి కూడా తక్కువై క్రమంగా ప్రేమ తెలుగు వెండితెరపై కనుమరుగయ్యారు. ప్రేమ తెలుగులో ధర్మ చక్రం చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. దేవి పుత్రుడు,  రాయలసీమ రామన్న చౌదరి లాంటి చిత్రాల్లో ప్రేమ నటించారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com