RIP Chalapathi Rao : సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత.. శోకంలో టాలివుడ్ ఇండస్ట్రీ..

- Advertisement -

RIP Chalapathi Rao : తెలుగు చిత్ర పరిశ్రమలో సీనియర్ నటులు మరణిస్తున్నారు.. నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ మృతిని మరువక ముందే మరో సీనియర్ నటుడు మృతి చెందడంతో ఇండస్ట్రీలో విషాదచాయలు అలుముకున్నాయి. కైకాల మరణం వార్తను మరువక ముందే ఇప్పుడు మరో నటుడు కన్నుమూశారు…సీనియర్ నటుడు చలపతిరావు (78) కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు.. ఎన్నో సినిమాలలో విభిన్న పాత్రలలో నటించారు..ముఖ్యంగా విలన్ పాత్రలో ఎక్కువగా కనిపించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు.. నటుడుగా అందరి మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

Chalapathi Rao
Chalapathi Rao

ఆయనకు ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇద్దరూ అమ్మాయిలు అమెరికాలో సెటిల్ అయ్యారు.. వాళ్లు ఇండియా వచ్చినప్పుడు పిల్లలందరితో కలిసి బల్లిపర్రు వెళుతుంటారు. చలపతిరావు తిరిగిరాని లోకాలకు వెళ్లారనే వార్త తెలుగు ఫిల్మ్‌ ఇండస్ట్రీని దిగ్బ్రాంతికి గురి చేసింది. ఆయన మరణం ఇండస్ట్రీకి తీరనిలోటన్నారు సినీ దిగ్గజాలు.. ఆయన మరణ వార్త విని చాలా మంది కన్నీటి పర్యంతం అవుతున్నారు…

ఎన్నో దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను తన నటనతో అలరిస్తోన్న సీనియర్ నటుడు చలపతిరావును వాళ్లు బాబాయ్ అని ఆప్యాయంగా పిలుచుకుంటారు. మహానటుడు స్వర్గీయ ఎన్టీ రామారావు దగ్గర నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి పనిచేసిన దిగ్గజ నటుడు చలపతిరావు. ఇండస్ట్రీలో మంచి పేరున్న చలపతిరావు ఇమేజ్ రెండేళ్ల క్రితం మసకబారింది..ఆయనకు ఎందుకో సినిమా ఆఫర్లు మాత్రం రాలేదు..

- Advertisement -
RIP Chalapathi Rao


1966లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన గూఢచారి తో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన దాదాపు పన్నెండు వందల పైగా సినిమాల్లో పలు విభిన్న పాత్రల్లో నటించారు. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రు. తండ్రి మణియ్య. తల్లి వియ్యమ్మ, 1944 మే 8న పుట్టిన చలపతిరావుకి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు..కుమారుడు రవిబాబు టాలీవుడ్‌ నటుడు, దర్శకుడు..హార్రర్ సినిమాలను తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు..ఇక ఆయన సొంత జిల్లాలోనే ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు..

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here