Bigg Boss Telugu ప్రస్తుతం బుల్లితెరపై హయ్యాస్ట్ టీఆర్పీతో దూసుకుపోతున్న బిగ్గెస్ట్ రియాల్టీ షో. ఈ షో ద్వారా ఎంతో మంది పాపులారిటీ సంపాదించుకున్నారు. సినిమాల్లో సపోర్టింగ్ క్యారెక్టర్స్, సీరియల్స్ లో లీడ్ రోల్స్ చేస్తూ వచ్చిన నటుడు కౌశల్. అప్పటి వరకు గుర్తుపట్టని వారు కూడా బిగ్ బాస్ షోతో ఆయన అందరి దృష్టిని ఆకర్షించాడు. అప్పట్లో అతని కోసం ఒక ఆర్మీ ఏర్పడిందంటే తను ఎంతటి క్రేజ్ తెచ్చుకున్నాడో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. ప్రేక్షకుల మనసు గెలుచుకోవడమే కాకుండా, బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ కూడా గెలుచుకున్నాడు. ఆ సమయంలో అతనిపై నెగిటివిటీ కూడా వచ్చింది. గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో ఆయన చెప్పిన మాటలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా కౌశల్ మాట్లాడుతూ.. ‘ఎవరైనా నా గురించి నెగటివ్ గా మాట్లాడినా, నెగటివ్ గా గెలికినా నాకు ఎక్కడో తగులుద్ది. నా అనుభవం అంత వయసు లేదు దీప్తి సునయనకు.. తనొచ్చి.. కౌశలా.. రెండు వారాల్లో వెళ్ళిపోతాడని అన్నది. ఎప్పుడైతే హోస్ట్ చేస్తున్న నాని ఆ దృశ్యాన్ని టీవీలో చూపారో.. ఆ క్షణంలోనే నిర్ణయించుకున్న నేనేంటో వీళ్ళతో పాటుగా ఈ ప్రపంచానికి చూపించాలి అనుకున్న. రెండు వారాల్లో నేను వెళ్లిపోతానని నా ప్రోమో కూడా రెడీ చేశారు. కానీ శుక్రవారం రాత్రి 11 గంటలకు ఓటింగ్ క్లోజ్ అవుతుందన్న టైంలో నిమ్మకాయ ఎపిసోడ్ రిలీజ్ కావడం.. కేవలం గంటలో నా రాత మారిపోయింది. ఇదంతా నా లక్ అనే చెప్పుకోవాలి. ఆ నిమ్మకాయ అప్పుడు పిండకుండా తర్వాతి ఎపిసోడ్స్ లో పిండి ఉంటే నేను అప్పటికి ఉండేవాడిని కాదు” అని అన్నారు.
‘బిగ్ బాస్ షో అంతా బోగస్’ అంటూ అప్పట్లో ఓ ఛానల్ నిర్వహించిన డిబేట్ లో కౌశల్ పాల్గొనడంపై కూడా స్పందించారు. తప్పుడు స్టేట్‌మెంట్స్ తీసుకుని స్టూడియోకి రమ్మని తనను ఏవేవో చేశారన్నారు. బిగ్ బాస్ అంతా బోగస్ అని పెట్టినప్పుడే.. తాను ఆ కార్యక్రమానికి వెళ్లకుండా ఉండాల్సింది అని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ ప్రజలు ఏది చెప్పినా నమ్ముతారు.. మన సైడ్ నుంచి తప్పు లేదు కాబట్టి.. వారు అన్న దాంట్లో నిజం లేదని నిరూపించేందుకు నేను ఆ స్టూడియోకి వెళ్లాను అని తెలిపారు. తాను ఇలాంటివేవీ పెద్దగా పట్టించుకోనన్నారు.
కానీ ఈ విషయాన్ని మాత్రం కాస్త సీరియస్ గా తీసుకున్నానని తెలిపారు. కారణం.. కొన్ని లక్షల, కోట్ల మంది షో చూస్తుంటారు. వీళ్లు చెప్పింది నిజమని నమ్ముతారేమో అన్న భయంతో వాళ్లను నిజం చెప్పాలన్న ఉద్దేశంతో వెళ్లాను అన్నారు కౌశల్. లేకపోతే అసలు వెళ్లే వాడిని కాదని, ట్రోల్స్ చేస్తే చేశారులే అనుకుని వదిలేసే వాడినన్నారు. బిగ్ బాస్ ముందు గానీ, తర్వాత గానీ ప్రజలను ఎడ్యుకేట్ చేయడాన్నే తాను ఇష్టపడతానని కౌశాల్ అన్నారు. సొంతంగా తాను నేర్చుకున్న ఫ్యాషన్ విద్యను పందిమందికి పంచుతానని చెప్పారు. ఇప్పటివరకు తాను 3 వేల మందిని మోడల్స్ గా తీర్చిదిద్దానన్నారు.