Kiran Abbavaram : మరోసారి లవర్ తో అడ్డంగా దొరికిన కిరణ్ అబ్బవరం.. ఇప్పుడేం చెబుతాడో ఇక..

- Advertisement -

Kiran Abbavaram : రాజావారు రాణిగారు అనే సినిమాతో కిరణ్ అబ్బవరం టాలీవుడ్ కు పరిచయమయ్యాడు. ఇదే సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది రహస్య గోరఖ్. ఈ సినిమా వీరిద్దరికి మంచి పేరును తీసుకొచ్చి పెట్టింది. ఆ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని టాక్. ఇక అప్పటినుంచి వీరిద్దరి మధ్య ప్రేమ కొనసాగుతూనే ఉంది. కానీ, వీరిద్దరూ అధికారికంగా తమ ప్రేమను అభిమానులకు చెప్పలేదు. కానీ, నెటిజన్స్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ లవ్ బర్డ్స్ ను కనిపెడుతూనే ఉన్నారు.

kiran abbavaram
kiran abbavaram

వినరో భాగ్యం విష్ణు కథ సినిమా సక్సెస్ అందుకున్నాక.. కిరణ్ వెకేషన్ వెళ్ళాడు. అది రహస్యతోనే అని కనిపెట్టారు. ఇద్దరు పోస్ట్ చేసిన ఫోటోల వెనుక బ్యాక్ డ్రాప్ ఒకటే ఉండడంతో ఈ జంట ప్రేమలో ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇక ఈ మధ్య.. కిరణ్ ఇంటి గృహప్రవేశం వేడుకలో రహస్య పూలు గుచ్చుతూ.. ఇంటి మనిషిలా కనిపించింది. ఇలా ప్రతిసారి ఈ జంట రిలేషన్ లో ఉన్నారని రుజువు చేస్తూనే ఉన్నారు. ఇక తాజాగా మరోసారి ఈ విషయంలో దొరికిపోయాడు కిరణ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న దావత్ అనే షో లో కిరణ్ మొట్ట మొదటి గెస్ట్ గా విచ్చేశాడు.

అషూ రెడ్డి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ షో లో రహస్య గురించి అడగగానే.. ముందు మా ఇద్దరి మధ్య ఏం లేదని.. ఏదైనా ఉంటే మేమే చెప్తామని చెప్పుకొచ్చిన కిరణ్.. ఆ తరువాత అషూ మేము అంటున్నారంటే.. ఏదో ఉంది అని అనగానే.. కిరణ్ సిగ్గుపడుతూ.. నేను ఇచ్చిన ఇన్ని ఇంటర్వ్యూలలో ఎప్పుడు ఇలా దొరికిపోలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here