Sandeep Master : మీ లాంటి చెత్త హోస్ట్ ని ఎక్కడా చూడలేదు అంటూ నాగార్జున పై ఫైర్ అయిన సందీప్ మాస్టర్!

Sandeep Master


Sandeep Master : ఒక డ్యాన్స్ మాస్టర్ గా సందీప్ మన అందరికీ ఆట , ఛాలెంజ్ రోజుల నుండి అందరికీ సుపరిచితమే. ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ లో ఆయన చాలా అగ్రెసివ్ గా ఉండేవాడు. తనని ఒక మాట అంటే అసలు తీసుకునే వాడు కాదు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టక ముందు ఆయన నీతోనే డ్యాన్స్ అనే ప్రోగ్రాం లో కంటెస్టెంట్ గా చేసాడు. తన భార్య తో ఆయన ఎన్నో డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఇచ్చి టైటిల్ ని కూడా సొంతం చేసుకున్నాడు.

Sandeep Master
Sandeep Master

ఈ ప్రోగ్రాం లో కూడా అగ్రెసివ్ అవ్వాల్సిన సమయం లో సందీప్ మాస్టర్ బాగానే అగ్రెసివ్ అయ్యాడు. కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రం ఆయన చాలా సేఫ్ గా ఆడుతున్నట్టుగా అందరికీ అనిపించింది. హౌస్ లో ఆయన కోపం తెచ్చుకున్న సందర్భాలను చేతి వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత అనేక విషయాల్లో ఆయన చాలా ఓపెన్ గా మాట్లాడుతున్నాడు.

Sandeep Master Dance

ఇదంతా పక్కన పెడితే ఒకసారి నామినేషన్స్ లో సందీప్ ప్రశాంత్ తో వాదనలో ఉన్నప్పుడు పొరపాటున ఆ హీట్ వాతావరణం లో ‘బొంగు’ అనే పదాన్ని వాడుతాడు. అందుకు నాగార్జున నుండి సందీప్ కి ఒక రేంజ్ లో కోటింగ్ పడుతుంది. పదే పదే సందీప్ ని బొంగులో డ్యాన్సర్ అంటూ సంబోధించి ఆయన్ని అవమానించాడు. దీనికి సందీప్ సతీమణి జ్యోతి కూడా చాలా బాధపడింది.

Sandeep Master Bigg boss

రీసెంట్ గా శివాజీ కూడా అలా మాట్లాడినప్పుడు నాగార్జున ఆయన్ని మందలించాడు కానీ, సందీప్ మాస్టర్ ని తిట్టినట్టుగా మాత్రం తిట్టలేదు. దీనికి సందీప్ మాస్టర్ ఇంస్టాగ్రామ్ లో ఒక పోస్టుని పెడుతూ ‘ నేను మాట్లాడితే బూతులు.. ఆయన మాట్లాడితే నీతులు, భలే న్యాయం చెప్పారు నాగార్జున గారు’ అంటూ చాలా వ్యంగ్యంగా ఆయన పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.