Bigg Boss Telugu 7 : సందీప్ మాస్టర్ అవుట్.. శోభా శెట్టి సేఫ్..చివరి క్షణం లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన బిగ్ బాస్!

- Advertisement -

Bigg Boss Telugu 7 : ఎన్నడూ లేని విధంగా ఈ వీకెండ్ ఎపిసోడ్స్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూసారు. వాడావేడి వాతావరణం మధ్య సాగిన గత వారం నామినేషన్స్ లోకి అందరూ టాప్ కంటెస్టెంట్స్ వచ్చారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనే ఉత్కంఠ ఆడియన్స్ లో నెలకొంది. హౌస్ లో శోభా అతి యాటిట్యూడ్ ని ఇష్టపడని ఆడియన్స్ కచ్చితంగా ఆమెనే బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అవుతుందని అనుకున్నారు.

Bigg Boss Telugu 7
Bigg Boss Telugu 7

సోషల్ మీడియా పోలింగ్ ప్రకారం చూస్తే ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ గా శోభా శెట్టి నే నిలుస్తుంది. కానీ ఆమెతో దాదాపుగా సరిసమానంగా సందీప్ మాస్టర్ కి కూడా ఓట్లు వచ్చాయి. ఈ ఇద్దరిలో ఎవరు బయటకు పోతారు అనే ఉత్కంఠ కి తెరదించుతూ సందీప్ మాస్టర్ ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యాడు.

Sandeep Shoba SHetty

హౌస్ లో ‘పవర్ అస్త్ర’ ని గెలుచుకున్న మొట్టమొదటి కంటెస్టెంట్ ఆయనే. ఇదే ఆయన పాలిట శాపం లాగ మారింది. 5 వారాలు ఇమ్మ్యూనిటి పొందిన సందీప్ , 6 వ వారం , 7 వ వారం కూడా నామినేషన్స్ నుండి తప్పించుకున్నాడు. గత వారం నామినేషన్స్ లోకి వచ్చాడు ఎలిమినేట్ అయిపోయాడు. మరో విశేషం ఏమిటంటే హౌస్ లో ఎలిమినేట్ అయిన మొట్టమొదటి మేల్ కంటెస్టెంట్ కూడా సందీప్ మాస్టర్ మాత్రమే.

- Advertisement -
Sandeep Master

టాస్కులు చాలా చక్కగా ఆడే సందీప్ మొదట్లో తొండి ఆటలు బాగానే ఆడేవాడు. ఆ తర్వాత సంచాలక్ గా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే సేఫ్ గేమ్ ఆడడం సందీప్ మాస్టర్ ని ఈరోజు ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఆయన నామినేషన్స్ లోకి వస్తూ ఉండుంటే ఓటింగ్ పడుతూ ఫ్యాన్ బేస్ ఏర్పడేది, ఇలా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండేది కాదంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here