తెలుగోడితో పాటుగా ప్రతీ భారతీయుడు ఎంతో గర్వించదగ్గ సినిమా #RRR ని నిర్మించిన డీవీవీ దానయ్య రేంజ్ ప్రస్తుతం ఎలా మారిపోయిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. డైరెక్టర్ రాజమౌళి అడిగింది అడిగినట్టు సమయానికి అన్నీ సమకూర్చే బడ్జెట్ ని ఇచ్చి, ఇలాంటి అద్భుతాన్ని ఆవిష్కరించాడు దానయ్య. ప్రస్తుతం ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో #OG అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

ఈ చిత్రానికి ప్రముఖ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే ముంబై మరియు పూణే వంటి ప్రాంతాలలో భారీ షెడ్యూల్ ని పూర్తి చేసుకుంది. ఈ నెల 17 వ తారీఖు నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ పాల్గొంటాడో లేదో తెలియాల్సి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే డీవీవీ దానయ్య కి కళ్యాణ్ అనే కొడుకు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇతను #RRR మూవీ ప్రొమోషన్స్ లో మీడియా కి పరిచయం చేసాడు దానయ్య. ఇతను ప్రస్తుతం ‘అధీరా’ అనే చిత్రం ద్వారా టాలీవుడ్ కి పరిచయం కాబోతున్నాడు.ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదంతా పక్కన పెడితే కళ్యాణ్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.సమంత ని ఆయన ఈ నెల 20 వ తారీఖున అతిరథ మహారథుల సమక్షం లో పెళ్లాడబోతున్నారు.

సమంత అంటే హీరోయిన్ సమంత అనుకునేరు, ఆమె అసలు పేరు సమంత రెడ్డి. సినిమా ఇండస్ట్రీ కి ఆమెకి ఏమాత్రం సంబంధం లేదు.ఈ వివాహ మహోత్సవానికి టాలీవుడ్ కి చెందిన ప్రముఖులందరూ హాజరు కాబోతున్నారు.

దీనికి సంబంధించిన మరికొన్ని వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. మరోపక్క సమంత పేరు తో బాగా ప్రాచుర్యం పొందిన ఆ పెళ్లి కూతురు ఎవరో తెలుసుకునేందుకు నెటిజెన్స్ ఉత్సహం చూపిస్తున్నారు. ఆమె ఫోటోలు ప్రస్తుతానికి అయితే ఒక్కటి కూడా బయటకి రాలేదు, మే 20 వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.