Samantha: రాజకీయాల్లోకి సమంత.. ఆ పార్టీలో కీలకపదవి

- Advertisement -

Samantha: నాగ చైతన్యతో ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది సమంత. ఎన్నో ఇండస్ట్రీ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతుంది. ఇండస్ట్రీలో దశాబ్ధాల పాటు హీరోయిన్‎గా కెరీర్ కొనసాగిస్తున్న వారి జాబితాలో తమన్నా ఒకరు. స్టార్ హీరోయిన్‎గా వరుస సినిమాలతో దూసుకుపోతుంది. తాజాగా ఖుషి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ సాధించింది. సీటాడెల్ వెబ్ సిరీస్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టబోతుంది. ఈ మధ్య కాలంలో మయోసైటిస్ బారిన పడి ఏడాది పాటు సినిమాలకు విరామం ప్రకటించింది. ప్రస్తుతం అందుకు చికిత్స చేయించుకునేందుకు అని అమెరికాకి వెళ్ళింది. మయోసైటిస్ చికిత్స నిమిత్తం సమంత కొన్ని నెలల పాటు అమెరికాలో ఉండనుంది. అక్కడే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇళ్లు కూడా కొన్నదని వార్తలు కూడా వచ్చాయి.

Samantha
Samantha

ఇక విషయంలోకి వస్తే.. ఇటీవల సినీ పరిశ్రమకు చెందిన వారు పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా సమంత కూడా రాజకీయాల్లోకి వస్తుందన్న వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తెలంగాణ ప్రజలకు సమంతతా అంటే ఎక్కువ అభిమానం ఉంది. ఆమె ఇప్పటికే రైతన్నలకు మద్ధతుగా చాలా కార్యక్రమాల్లో పాల్లొంటూనే ఉంటుంది. అలాగే తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. దీంతో ఆమెను అధికార పార్టీ బీఆర్ఎస్ ఆహ్వానించి.. స్టార్ క్యాంపెయిన్ గా ప్రచారం చేయిస్తే పార్టీకి కలిసి వస్తుందని భావిస్తున్నారట. ఈ మేరకు బీఆర్ఎస్ అధిష్టానం సమంతతో చర్చలు జరిపినట్లు సమాచారం. కాకపోతే ఈ విషయంపై సమంత అభిమానులు తను పాలిటిక్స్ లోకి అడుగుపెడుతుందన్న వార్తలు కొట్టపారేశారు. రాజకీయాలంటే సమంతకు అసలు ఇష్టం ఇండవని చెప్పుకొచ్చారు. సమంత ఇప్పటికే అనారోగ్య సమస్యల వల్ల బాధపడుతోంది. దయ చేసి ఇలాంటి పుకార్లు సృష్టించవద్దని కోరుకుంటున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here