Samantha : ఒకే స్విమ్మింగ్ పూల్ లో సమంత-విజయ్ దేవరకొండ.. అడ్డంగా బుక్కయ్యారుగా..

- Advertisement -

Samantha : విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన లేటెస్ట్ మూవీ ఖుషి. తాజాగా విడుదలైన ఖుషి సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. రొటీన్ స్టోరీ, గెస్ చేసే సీన్స్, కొంత ల్యాగ్ ఉన్నప్పటికీ ఓవరాల్‍గా సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్‍లా ఉందని రివ్యూలు చెబుతున్నాయి. దీంతో ఎంతోకాలంగా హిట్ కోసం పడిగాపులు పడిన విజయ్ దేవరకొండకు సక్సెస్ కొట్టినట్లే అని అంటున్నారు.

Samantha
Samantha

ఇక మరోవైపు శాకుంతలం వంటి ఫెయిల్యూర్ తర్వాత సమంత, టక్ జగదీష్ ప్లాప్ అనంతరం డైరెక్టర్ శివ నిర్వాణకు ఖుషి రూపంలో హిట్ లభించినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఖుషి సినిమా ప్రమోషన్లను విభిన్నంగా, జోరుగా చేస్తూ వచ్చింది మూవీ టీమ్. ఖుషి మ్యూజికల్ కాన్సెర్ట్ లో స్టేజీపై సామ్, విజయ్ చేసిన డ్యాన్స్ వీడియో తెగ వైరల్ కాగా.. మీమ్స్ తో ట్రెండ్ అయింది. తాజాగా ఖుషి మూవీ విడుదలముందురోజు రాత్రి విజయ్ దేవరకొండ ఓ వీడియోతో ప్రమోషన్ చేశాడు.

ఓ స్విమ్మింగ్ పూల్‍లో ఉన్న విజయ్ దేవరకొండ ఖుషి సినిమా రిలీజ్, రెస్పాన్స్ గురించి మాట్లాడాడు. అయితే సమంత గురువారం రాత్రి కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులోని ఓ ఫొటోలో ఆమె స్విమ్మింగ్ పూల్‍లో ఉంది. సమంత, విజయ్ దేవరకొండ ఉన్న స్విమ్మింగ్ పూల్ కాస్తా ఓకేలా ఉండటంతో నెటిజన్లు ఇద్దరూ ఒకే చోట ఉన్నారు అని కామెంట్స్ పెడుతున్నారు. సమంత ఫొటోకు కెమెరా మెన్ విజయ్ దేవరకొండనా అంటూ పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here