Samantha : విజయ్ దేవరకొండ అలాంటి వాడని తెలిసి షాకయ్యా

- Advertisement -

Samantha : మంచైనా, చెడైనా పాజిటివ్‌గా తీసుకునే బలాన్ని తాను గడించిన అనుభవమే ఇస్తుందన్నారు ప్రముఖ నటి సమంత. ఈ విషయంలో తనకెలాంటి గైడ్‌, బుక్‌ లేదని సరదాగా చెప్పారు. ‘ఖుషి’ సినిమా ప్రచారంలో భాగంగా తమిళ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ‘సమంత గురించి ఏ అప్‌డేట్‌ వచ్చినా అది బజ్‌ క్రియేట్‌ చేస్తుంది. ఈ క్రమంలో వచ్చే నెగెటివిటీ, పాజిటివిటీని చిరు నవ్వుతో స్వీకరిస్తారు. అలా ఎలా ఉండగలుగుతున్నారు?’ అన్న ప్రశ్నకు సమంత సమాధానమిచ్చారు.

Samantha
Samantha

విజయ్ దేవరకొండ, సమంత జంటగా దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమిది. సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్‌, సమంత కలిసి ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సినిమా గురించి విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఖుషి’లో నటించడం సంతోషంగా ఉంది. విజయ్ ని చూసి చాలామంది ఏదేదో అనుకుంటారు. కానీ అతడికి ఒక్క చెడు అలవాటు కూడా లేదు. ఇది తెలిసి నేనే షాకయ్యాను. ఒకానొక సమయంలో ప్రేమకథా చిత్రాలను చేయకూడదనుకున్నా. కానీ, కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో నటించా. ఈ సినిమా స్క్రిప్టు నాకు బాగా నచ్చింది. ప్రతి ఒక్కరికీ ఈ కథ కనెక్ట్‌ అవుతుందని అనుకుంటున్నా. శివ దర్శకత్వంలో నేను తొలిసారి నటించా.

ఆయనతో కలిసి సమంత బ్లాక్‌ బస్టర్‌ చిత్రానికి (మజిలీ) పనిచేసింది. చిత్రీకరణ పూర్తై, పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న సమయంలో ఎప్పుడు శివకు కాల్‌ చేసినా ‘సెప్టెంబరు 1న నీ ముఖంపై చిరు నవ్వు చూడాలని ఉంది బ్రో’ అని చెప్పేవాడు’’ అని అన్నారు. ఈ సినిమాలో పలు పార్శ్వాలు, సరికొత్త సన్నివేశాలు ఉంటాయని సమంత తెలిపారు. గతంలో.. ‘మహానటి’ చిత్రంలో విజయ్‌ దేవరకొండతో కలిసి నటించానని చెబుతూ నాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నారు. ఈ సినిమా కోసం సమంత పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేనని, సెప్టెంబరు 1న సమంత ముఖంలో నవ్వు చూడాలనుందని విజయ్‌ ‘ఖుషి మ్యూజికల్‌ ఈవెంట్‌’లో చెప్పిన సంగతి తెలిసిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here