Sukumar తో సినిమా పట్టు.. నేషనల్ అవార్డు కొట్టు.. రాజమౌళి కంటే విలువైన డైరెక్టర్!

- Advertisement -

Sukumar : కాలేజీ లో లెక్కల మాస్టర్ గా పనిచేసిన సుకుమార్ గారు , అలాగే కొనసాగి ఉంటె నేడు టాలీవుడ్ కి ఒక గొప్ప దర్శకుడు మిస్ అయ్యి ఉండేవాడు అని చెప్పొచ్చు. తన వృత్తి మీద కంటే చిన్నప్పటి నుండి సినిమాల మీద ఉన్న విపరీతమైన మక్కువతో ఇండస్ట్రీ కి వచేసాడు. ఒక్క అవకాశం కోసం ఆయన కెరీర్ ప్రారంభం లో ఎన్నో అవస్థలు పడ్డాడు.

Sukumar
Sukumar

అలాంటి సమయం లో ఆయనకీ అవకాశం ఇచ్చింది దిల్ రాజు మరియు అల్లు అర్జున్. అప్పట్లో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన మొదటి చిత్రం ‘ఆర్య’ ఇండస్ట్రీ ని షేక్ చేసింది. లవ్ స్టోరీస్ లో సరికొత్త ట్రెండ్ ని సృష్టించింది. ఆ సినిమా తర్వాత ‘రంగస్థలం’ వరకు ఆ రేంజ్ హిట్ మళ్ళీ సుకుమార్ కి రాలేదు కానీ, ఈ డైరెక్టర్ సినిమాలన్నీ కొత్తగా ఉంటాయి అనే పేరుని మాత్రం తెచ్చుకున్నాడు.

ఇక మహేష్ బాబు తో చేసిన ‘1 నేనొక్కడినే’ చిత్రం తో సుకుమార్ టాలెంట్ మరింత వ్యాప్తి చెందింది. ఇందులో మహేష్ బాబు తో అద్భుతమైన నటన ని లాక్కున్నాడు. సినిమా అప్పటి ఆడియన్స్ కి బాగా అడ్వాన్స్ గా అనిపించడం వల్ల కమర్షియల్ గా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది కానీ, సుకుమార్ కి మాత్రం మంచి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఆయన చేసిన ప్రతీ సినిమాలోనూ హీరోల నుండి కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ని రాబట్టుకున్నాడు. ‘రంగస్థలం’ చిత్రం తో రామ్ చరణ్ నుండి ఏ స్థాయి నటన రాబట్టుకున్నాడో అందరికీ తెలిసిందే.

- Advertisement -

నేషనల్ అవార్డ్స్ కి రామ్ చరణ్ ని నామినేట్ అయ్యేలా చేసింది. చివరి నిమిషం లో అవార్డు చేజారిపోయింది. కానీ పుష్ప సినిమాతో అల్లు అర్జున్ మాత్రం మిస్ అవ్వలేదు. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే మొట్టమొదటి నేషనల్ అవార్డుని అందుకున్న ఏకైక హీరో గా అల్లు అర్జున్ చరిత్ర సృష్టించాడు. ఇదంతా సుకుమార్ వల్లే సాధ్యపడింది. ఇప్పుడు మన స్టార్ హీరోలకు కలెక్షన్స్ కి వేరే లెవెల్ చూడాలంటే రాజమౌళి తో, అలాగే కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ యాక్టింగ్ చెయ్యాలంటే సుకుమార్ తో సినిమాలు చెయ్యాలి. మరి వీళ్ళిద్దరిలో స్టార్ హీరోస్ ఎవరిని ఎంచుకుంటారో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here