Samantha : నాకు అన్నీ అల్లు అర్జునే అంటోన్న సమంత.. కారణమిదే..

- Advertisement -

Samantha : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన యాక్టింగ్ రోల్ మోడల్ అంటున్న సమంత. ఈ ఇద్దరు కలిసి ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ మూవీ తరువాత ‘పుష్ప’ సినిమాలో ‘ఊ అంటావా’ అంటూ ఐటెం సాంగ్ లో కలిసి చిందేసి ఆడియన్స్ ని ఉర్రూతలూగించారు.

వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే చూడాలని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. అయితే సమంత ప్రస్తుతం యాక్టింగ్ కి బ్రేక్ ఇచ్చి తన హెల్త్ పై ఫోకస్ పెట్టింది. మైయోసైటిస్ నుంచి కోలుకునేందుకు చికిత్స తీసుకుంటున్న సమంత.. సినిమాలతో దూరంగా ఉన్నా, కొన్ని ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరవుతూ ఆడియన్స్ కి అప్పుడప్పుడు కనిపిస్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే రీసెంట్ గా ఓ కాలేజీ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ ఈవెంట్ లో స్టూడెంట్స్ తో ఇంటరాక్ట్ అయిన సమంత.. వారు అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తూ వచ్చారు.

samantha
samantha

ఈ నేపథ్యంలోనే ఓ స్టూడెంట్.. ‘మీకు యాక్టింగ్ రోల్ మోడల్ ఎవరు?’ అని ప్రశ్నించారు. దానికి సమంత బదులిస్తూ.. “నా యాక్టింగ్ రోల్ మోడల్ అల్లు అర్జున్. తనతో కలిసి మరో నటించాలని అనుకుంటున్నాను. ఎందుకంటే, తను ఇప్పుడు ఓ యాక్టింగ్ బీస్ట్ గా ట్రాన్స్‌ఫార్మ్ అయ్యారు” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోని అల్లు ఫ్యాన్స్ నెట్టింట వైరల్ చేస్తూ సందడి చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here