Samantha : అతని కోసం ఎంతైనా అయినా ఖర్చు చేస్తా అంటూ సమంత షాకింగ్ కామెంట్స్!

- Advertisement -

Samantha : విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఖుషి’ చిత్రం సెప్టెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ రీల్స్ అవ్వబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, పాటలు , ట్రైలర్ ఇలా ప్రతీ ఒక్కటి కూడా మూవీ పై అంచనాలు విపరీతంగా పెరిగేలా చేసాయి. దానికి తగ్గట్టుగానే ప్రొమోషన్స్ కూడా చెయ్యడం తో రోజురోజుకి అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి.

Samantha
Samantha

ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ప్రారంభం కాలేదు, ఆగష్టు 30 వ తేదీ నుండి ప్రారంభిస్తాము అని నిర్మాతలు చెప్పుకొచ్చారు. ఇకపోతే రీసెంట్ గా విజయ్ దేవరకొండ, సమంత, వెన్నెల కిషోర్ మరియు డైరెక్టర్ శివ నిర్వణ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో సమంత మాట్లాడిన కొన్ని మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి, అవేంటో ఒకసారి చూద్దాం.

ఈ సినిమాలో వెన్నెల కిషోర్ ప్రధాన పాత్ర పోషించాడు, అతని గురించి నాలుగు మాటలు చెప్పండి అంటూ యాంకర్ అడగగా దానికి సమంత సమాధానం చెప్తూ ‘వెన్నెల కిషోర్ గారి నటన అంటే నాకు చాలా ఇష్టం. ఆయనని హీరో గా పెట్టి నేను ఒక సినిమాని నిర్మిస్తాను, ఎంత డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు’ అంటూ చెప్పుకొచ్చింది.

- Advertisement -

సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇంకా ఖుషి చిత్రం గురించి మాట్లాడుతూ నేను చేసిన సినిమాలలో ది బెస్ట్ గా ఈ ఖుషి చిత్రం నిలుస్తుంది. నా నటన కూడా నాకు ఎంతో నచ్చింది ఈ చిత్రం లో అంటూ చెప్పుకొచ్చింది. విజయ్ దేవరకొండ తో నటించడం చాలా బాగుంది, మళ్ళీ అవకాశం వస్తే అతనితో నటిస్తాను అంటూ సమంత చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here