సమంత సీక్రెట్ లవర్ ఇతనేనా…. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పిక్…

- Advertisement -

నాగచైతన్య తో విడిపోయిన తర్వాత గత రెండేళ్లగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్న హీరోయిన్ సమంత. అయినప్పటికీ ఆమె ఏమి చేసినా సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా విమర్శకు గురి అవుతుంది. రహస్యంగా ఎవరితోనో డేటింగ్ చేస్తుంది అన్న అనుమానాలు పలు సందర్భాలలో వ్యక్తం అయ్యాయి. 2018లో ప్రేమ వివాహం చేసుకున్న సమంత ,నాగచైతన్య నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత పరస్పర విభేదాల కారణంగా 2021 అక్టోబర్లో అధికారికంగా విడిపోయారు.ఇక ఆ తర్వాత నుంచి సమంత గురించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.

సమంత
సమంత

విడాకుల సమయంలో అయితే మరి సమంత మీద ఎఫైర్స్ ఉన్నాయి అన్న రూమర్స్ ఎక్కువగా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆమె పర్సనల్ స్టైలిష్ ,ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో సమంత చాలా క్లోజ్ గా మూవ్ అవుతున్నట్టు ఒక గ్లాసెప్ట్ స్ప్రెడ్ అయింది.ఒకరకంగా నాగచైతన్య కి విడాకులు ఇవ్వడానికి కారణం కూడా అదే అని కొందరు అభిప్రాయపడ్డారు.

ఈ క్రమంలో నాగచైతన్య ఫ్యాన్స్ అతన్ని సోషల్ మీడియాలో మాస్ ర్యాగింగ్ కూడా చేశారు. ఈ వేధింపులు తట్టుకోలేని ప్రీతమ్ సోషల్ మీడియాలో వివరణ కూడా ఇవ్వడం జరిగింది. తనకి సమంతకి మధ్య ఉన్న బంధం ఎలాంటిదో నాగచైతన్యకి కూడా స్పష్టంగా తెలుసు అని , తనని ఇలా వేధించడం మానమని కోరుతూ అతని స్టేట్మెంట్ ఇచ్చాడు.

- Advertisement -

అయితే సమంత ప్రస్తుతం తాజాగా ఓ అబ్బాయి తో కలిసి కనిపించడంతో…అతనే సమంత సీక్రెట్ లవర్ అన్న ఊహాగానాలు మొదలయ్యాయి. తన చికిత్స కోసం అమెరికా చేరుకున్న సమంత న్యూయార్క్ లోని ఒక జిమ్లో వర్కౌట్ చేస్తున్న ఒక ఫోటోని షేర్ చేయడం జరిగింది. అయితే సమంత వెనక ముఖం అటువైపు తిప్పి నిలబడి ఉన్న ఒక కండల వీరుడు కూడా ఆ ఫోటోలో కనిపిస్తున్నాడు. ఇంకేముంది వెంటనే అతను సమంత లవర్ కావచ్చు అన్న ఊహాగానాలతో సోషల్ మీడియా నిండిపోయింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com