Guess The Actor : ఈ ఫొటో లో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? ఇప్పుడు ఈ హీరోయిన్ డేట్స్ దొరకడం సూపర్ స్టార్స్ కి కష్టమే!

- Advertisement -

Guess The Actor : ఈ ఫొటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ఈమె తండ్రి సౌత్ ఇండియా లోనే పెద్ద సినిమాటోగ్రాఫర్. ఈయన ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్, మహేష్ బాబు ఇలా ఎంతో మంది సూపర్ స్టార్స్ సినిమాలకు సినిమాటోగ్రఫీ చేసాడు. త్వరలోనే విజయ్ దేవరకొండ తో కూడా ఒక సినిమా చెయ్యబోతున్నాడు. అలాంటి టాప్ సినిమాటోగ్రాఫర్ కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది ఈమె.

Guess The Actor
Guess The Actor

తండ్రి పెద్ద టెక్నీషియన్ అయినప్పటికీ కూడా అవకాశాల కోసం అతని సహాయం తీసుకునేందుకు ఇష్టపడలేదు ఈమె. తన సొంత టాలెంట్ తో 2013 వ సంవత్సరం లో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టింది. చేసింది తక్కువ సినిమాలే అయినా ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు. కుర్రాళ్లకు ఈమె కలల రాకుమారి. సోషల్ మీడియా లో ఈమెకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ స్టార్ హీరోలకు కూడా లేదు,ఆమె మరెవరో మాళవిక మోహనన్.

ఈమె ఇప్పటి వరకు కేవలం 11 సినిమాలు మాత్రమే చేసింది. అందులో రెండు సినిమాలు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ – మారుతీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఈమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తో పాటుగా పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ లో కూడా ఒక హీరోయిన్ గా నటించే ఛాన్స్ దక్కింది కానీ, ఎందుకో చివరి నిమిషం లో రిజెక్ట్ చేసింది. అలాగే ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర ‘ చిత్రం లో కూడా ఆమెని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట.

- Advertisement -

కానీ డేట్స్ సర్దుబాటు చేసే విషయం లో జాప్యం జరగడం తో ఆమె ఈ సినిమాలో నటించలేకపోయింది. అలా ఇప్పటి వరకు తెలుగు, హిందీ లో తప్ప దాదాపుగా అన్నీ భాషల్లో హీరోయిన్ గా నటించింది. తెలుగు లో మొట్టమొదటి సారి ప్రభాస్ చిత్రం తో ఎంట్రీ ఇవ్వబోతుంది, ఈ సినిమాతో ఆమె తెలుగు ఆడియన్స్ ని ఎలా అలరించబోతుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here