సిటాడెల్ ప్రమోషన్స్​ కోసం సమంత స్టన్నింగ్ లుక్.. ఘాటు పోజులతో హాట్ ఫొటోషూట్

- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తోంది. మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సమంత మొన్నటి వరకు తన హెల్త్ అపేట్స్, వెకేషన్ ఫొటోస్, అప్పుడప్పుడు ఫిలాసఫీ చెబుతూ కొటేషన్స్​ను తన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేది. కానీ గత పది రోజుల నుంచి వర్క్ మోడ్​లోకి వచ్చేసిన సమంత ఇక తన ప్రొఫెషనల్ లైఫ్​పై ఫోకస్ పెట్టింది. వారం నుంచి అయితే హాట్ హాట్ ఫొటోషూట్స్ చేస్తూ ఆ ఫొటోలను నెట్టింట షేర్ చేస్తోంది. తాజాగా ఈ భామ ఇన్​స్టాగ్రామ్​లో సొగసుల బాంబ్ విసిరింది. దెబ్బకు కుర్రాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తడం షురూ అయింది.

samantha
samantha

ప్రస్తుతం సిటాడెల్ ప్రమోషన్స్​లో బిజీగా ఉన్న సమంత తాజాగా అమెజాన్ ప్రైమ్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో సిటాడెల్ టైటిల్ రిలీజ్ చేశారు. సిటాడెల్-హనీ బన్నీ అనే టైటిల్​తో సమంత, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిటాడెల్ ఇండియన్ వెబ్ సిరీస్​ గ్లింప్స్​ను రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్​లో సామ్ ఫుల్ ఆన్ యాక్షన్ మోడ్​లో కనిపించింది. సూపర్ హిట్ ఫైట్స్ చేస్తూ కనిపించిన పది సెకన్లు ఆకట్టుకుంది. ఇక ఈ గ్లింప్స్ రిలీజ్ ఈవెంట్​కు సామ్ జబర్దస్త్ ఔట్​ఫిట్​లో వచ్చింది.

samantha

- Advertisement -

స్టన్నింగ్ ఔట్​ఫిట్​లో సామ్ అదిరిపోయింది. ఓవైపు క్లీవేజ్ చేస్తూ మరోవైపు ఘాటుగా పోజులిస్తూ ఫొటోలు దిగింది. ఈ హాట్ ఫొటోషూట్​కు సంబంధించిన ఫొటోలను కాస్త నెట్టింట్లో వదిలేసింది. అంతే క్షణాల్లో లైకులు, షేర్లు మొదలయ్యాయి. ఇక కుర్రకారైతే సామ్ అందానికి ముగ్ధులైపోయారు. ఈ రేంజ్​లో సామ్ హాట్​నెస్ ఉందేంట్రా బాబు అంటూ ఫిదా అవుతున్నారు. బ్రేక్ తీసుకుంటే తీసుకుంది కానీ ఇంత అందంగా తయారైంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఏం మాయ చేశావే అంటూ కుర్రకారు బేజారైపోతున్నారు.

samantha photos

ఇక సమంత సినిమాల సంగతికి వస్తే ప్రస్తుతం ఈ భామ సిటాడెల్ వెబ్ సిరీస్​లో నటించింది. ఇక ది ఫ్యామిలీ మ్యాన్-3లో కూడా నటించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. ఇవి కాకుండా ఇప్పటి వరకు సమంత ఇంకేం సినిమాలకు సైన్ చేయలేదు. మయోసైటిస్ వల్ల ఏడాది పాటు సినిమాల నుంచి సామ్ బ్రేక్ తీసుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడిప్పుడే వర్క్ మోడ్​లోకి వచ్చిన ఈ భామ తదుపరి సినిమాలు ఏం చేస్తుందని ప్రేక్షకులు, అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సామ్ నుంచి మూవీ అనౌన్స్​మెంట్ వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here