ఆ హీరోతో ప్రేమలో పడ్డ సమంత.. పెళ్లికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా

- Advertisement -

ఏం మాయ చేసావ్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన సమంత స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతుంది. ఇంచుమించుగా అందరు స్టార్ హీరోల సరసన నటించేసిన సమంత ఇప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ లెవెల్ లో పరుగులు పెడుతుంది. మొదటి సినిమాతో నాగచైతన్యతో ఆమె కెమిస్ట్రీ ఇప్పటివరకు తెలుగు ఆడియన్స్ ఎవరు మర్చిపోలేదు. ఆ తర్వాత నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకునే క్రమంలో వాళ్ళిద్దరి ప్రేమ గురించి ఎప్పుడూ వార్తలు సెన్సేషనల్ గానే ఉండేవి. అలా ఒకరిని ఒకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుని విడిపోతున్నారని తెలిసినప్పుడు.. దానికి సంబంధించిన వార్తలన్నీ ఆశ్చర్యాన్ని కలిగించాయి.

సమంత
సమంత

విడిపోయిన తర్వాత కూడా సమంత కంటిన్యూ సినిమాలతో బిజీగా ఉంటూ.. తన కెరియర్ పై ద్యాస పెట్టింది. సమంత పెళ్లి తర్వాత చేసిన సినిమాలు చాలావరకు హిట్ కొట్టాయి. విడాకులు తీసుకున్న తర్వాత కూడా కొన్ని సినిమాలు బాగానే హిట్ కొట్టాయి. అలాగే శాకుంతలం సినిమా డిజాస్టర్ అవ్వడంతో.. సమంత చాప్టర్ అయిపోయిందని అనేకమంది సోషల్ మీడియాలో వార్తలు పెట్టారు. సమంత మాత్రం ఫెయిల్యూర్ ని పట్టించుకోకుండా తన వంతు పని తాను చేస్తూ.. సక్సెస్ వైపు పరుగులు తీస్తుంది.

samantha varun dhawan

తాజాగా సమంత బాలీవుడ్లో వరుణ్ ధావన్ సరసన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ లో భాగంగా వరుణ్ ధావన్ సమంత ఇద్దరు చెట్టాపట్టా లేసుకొని పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతున్నారట. అంతేకాదు తాజాగా సమంత తన సోషల్ మీడియా ఖాతాలో నెక్స్ట్ ఇయర్ మీ అందరిని మేము ఇంప్రెస్ చేస్తాము అని ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవ్వడంతో ఇది చూసిన చాలా మంది నెటిజన్స్ వరుణ్ ధావన్ సమంత మధ్య ఏదో నడుస్తుందని, అందుకే వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకొని ఎక్కువగా తిరుగుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here