సిటడెల్ లో సమంత రెమ్యునరేషన్ తెలుసా.. ఆ సీన్ల కోసమే అంత తీసుకుందిట

- Advertisement -

సమంత తన సినిమా కెరియర్ ను బాగా బ్యాలన్స్ చేసుకుంటుంది.మయోసైటిస్ అనే ప్రాణంతకమైన వ్యాధి బారిన పడింది. అయితే పర్సనల్ లైఫ్ లో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కానీ వాటి ప్రభావం తన వృత్తి పై ఏ మాత్రం కూడా పడకుండా సమంత ఎంతో కష్టపడింది. ప్రస్తుతం వరుస పాన్ ఇండియా చిత్రాల తో బిజీ షెడ్యూల్ ను మెయింటైన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. అలాగే రెమ్యునరేషన్ ను కూడా భారీగా నే డిమాండ్ చేస్తోందని సమాచారం.ఇంకా గట్టిగా చెప్పాలంటే ఆ విషయంలో బాలీవుడ్ స్టార్స్ ను కూడా మించిపోతోంది. ఇంతకు ముందు ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఐదు కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ను తీసుకునే సమంత ఇప్పుడు రూ. 10 కోట్లపైకు పైగా అడుగుతుందని సమాచారం.

సమంత
సమంత

భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న సిటాడెల్‌ సిరీస్ లో సమంత నటిస్తున్న సంగతి తెల్సిందే. ఈ సిరీస్ యాక్షన్‌ సీన్స్ కోసం ఆమె చాలా కష్టపడుతుంది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సమంత తన సోషల్ మీడియా ఖాతాలో తరచుగా షేర్ చేస్తోంది. వాటిని చూసిన ఆమె ఫ్యాన్స్ సమంత ఎంతగానో కష్టపడుతోంది అని కామెంట్స్ కూడా పెడుతున్నారు. అందుకే సమంత ఈ సిరీస్ కోసం రెమ్యూనరేషన్ ను కూడా భారీగానే తీసుకున్నట్లుగా టాక్. రూ.10కోట్లుతో భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ దక్కించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దానికి తగ్గట్లుగానే యాక్షన్ సన్నివేశాల కోసం సమంత కష్టపడుతోంది.

samantha varun dhawan

అడిగినంత ఇస్తేనే ప్రాజెక్ట్ పై సైన్ చేస్తానని కూడా గట్టిగా చెప్పేస్తుందట. ఇక సమంతకు నేషనల్ వైడ్ గా భారీ క్రేజ్ ఉంది. మంచి మార్కెట్ కూడా ఉంది. ఈ విషయాన్ని దృష్టి లో పెట్టుకునే నిర్మాతలు కూడా సమంత అడిగిన మొత్తం ఇచ్చేందుకు ఒప్పేసుకుంటున్నారని ప్రచారం అయితే జరుగుతోంది. కాగా సమంత చేతి లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఖుషి కూడా ఒకటి. టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ మరియు సమంత కాంబోలో రూపుదిద్దుకుంటున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ సినిమా ఇది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here