సరైనా జోడి కావాలి.. ఆఖరికి పెళ్లిల బ్రోకర్ గా మారిన సమంత

- Advertisement -

సమంత అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత కొంత కాలం సైలెంట్ గా ఉన్న సమంత మళ్లీ ఫుల్ ఫామ్ లోకి వచ్చేసినట్లే కనిపిస్తోంది. గతంలో మాదిరి సోషల్ మీడియాలో సామ్ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తోంది. ఓ వైపు మయోసైటిస్ కు చికిత్స తీసుకుంటూనే మరోవైపు పలు చిత్రాల్లో నటిస్తూ సమంత ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా సమంత తన ఇన్ స్టాలో పోస్ట్ చేసిన స్టోరీ వైరల్ గా మారింది. కరెక్ట్ జోడి కోసం వెతుకుతున్నామని సమంత ఇంస్టాగ్రామ్ పోస్ట్ పెట్టారు. సింగిల్ స్టేటస్ అనుభవిస్తున్న సమంత కామెంట్ వైరల్ అవుతుంది.

సమంత
సమంత

సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. తన మనసులోని భావాలు, సినిమా అప్డేట్స్ పంచుకుంటారు. సోషల్ ఇష్యూస్ మీద కూడా స్పందిస్తారు. తాజాగా సమంత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆమె రైట్ పార్ట్నర్ కోసం వెతుకుతున్నామని ఓ కామెంట్ చేశారు. అయితే ఆమె పార్ట్నర్ ని వెతుకుతుంది తన కోసం కాదు. తన సన్నిహితుడు కోసం. డాక్టర్ జెవెల్ గమాడియాకు మంచి జోడీ కావాలట. అతని ఫోటో షేర్ చేసిన సమంత జోడీ కావాలన్నారు. అలాగే డాక్టర్ గమాడియా లక్షణాలు కూడా సుచాయిగా చెప్పారు. పైకి కనిపించే దానికంటే తెలివైనవాడు అంటూ మరో కామెంట్ చేసింది.

ఈ క్రమంలో సమంత సంబంధాలు కూడా చూస్తున్నారా? అని కొందరు వాపోతున్నారు. ఇంతకీ ఎవరీ డాక్టర్ గమాడియా అంటే … వెస్ట్రన్ అక్యుపెంచర్ నిపుణుడు. ఇతడు సెలెబ్రిటీ వైద్యుడు. కత్రినా కైఫ్ తో పాటు పలువురు స్టార్స్ డాక్టర్ గమాడియా వద్ద ట్రీట్మెంట్ తీసుకున్నారు. సమంతకు కూడా గమాడియా వైద్యం చేసినట్లు సమాచారం. ఇక సమంత సిటాడెల్ యాక్షన్ సిరీస్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. సిటాడెల్ ఇంటర్నేషనల్ సిరీస్. ఇంగ్లీష్ లో ప్రియాంక చోప్రా చేశారు. దాని ఇండియన్ వెర్షన్ లో సమంత నటిస్తున్నారు. బోల్డ్ సన్నివేశాలు కూడా ఎక్కువగానే ఉంటాయని సమాచారం. శృంగార సన్నివేశాల్లో నటించేందుకు చాలా ఇబ్బందిపడ్డానని ప్రియాంక చోప్రా నేరుగా చెప్పారు. ఏప్రిల్ 28 నుండి సిటాడెల్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here