ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న సమంత పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆమె భారీ అంచనాలు పెట్టుకొని నటించిన శాకుంతలం సినిమా ఫ్లాప్ అయింది . ఈ క్రమంలోనే ఆమెను హ్యూజ్ రేంజ్ లో ట్రోలింగ్కి గురి చేశారు . అయినా అలాంటి కామెంట్స్ ని ఏ మాత్రం పట్టించుకోని సమంత తన నెక్స్ట్ సినిమా షూట్స్ లో బిజీబిజీగా పాల్గొంటుంది. ఈ క్రమంలోనే తన సోషల్ మీడియా ఖాతాలో ఆమె నటిస్తున్న వెబ్ సిరిస్ సిటాడిల్ కు సంబంధించి కొన్ని పిక్స్ షేర్ చేసుకుంది. అయితే ఆ వెబ్ సిరీస్ పై ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు సమంత చెప్పిన సమాధానం అందరినీ ఆకట్టుకుంటోంది.

ప్రియాంక చోప్రా నటించిన సిటడెల్ తెలుగులోనూ విడుదలైంది. అందరూ చూశారు కదా.. మళ్లీ మీరు దాన్ని ఎందుకు రీమేక్ చేస్తున్నారు?” అంటూ ప్రశ్నించారు. ఇందుకు సామ్ స్పందిస్తూ.. ఇది రీమేక్ కాదంటూ క్లారిటీ ఇచ్చింది. ఈ కామెంట్‌పై మరోయూజర్ స్పందిస్తూ.. “సిటడెల్ అన్ని దేశ భాషల్లోనూ తెరకెక్కుతోంది. ఇండియన్ వెర్షన్‌లో సమంత, వరుణ్ ధావన్ నటిస్తున్నారు. ప్రాంతానికి తగినట్లుగా సిరీస్‌లో మార్పులు చేస్తున్నారు.” అని పోస్ట్ పెట్టారు. దీనికి సమంత లైక్ కొట్టింది. దీంతో సమంత ఫ్యాన్స్ ఆ నెటిజన్ను ఒక ఆట ఆడేసుకున్నారు. సమంతకు ఒకరు చేసిన సిరీస్ ను రీమేక్ చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. ఏదేమైనా అతడు మాత్రం సమంత రిప్లై ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు.

ఇక సిటాడెల్ లో సమంతతో పాటు వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సిరీస్ షూటింగ్ మొదలు కాగా.. త్వరలోనే ఈ సిరీస్ విడుదలపై సిటడెల్ టీమ్ క్లారిటీ ఇవ్వనుంది. మరోపక్క సమంత వరుసగా సినిమాలు కూడా చేస్తోంది. ఇప్పటికే శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ అనే లవ్ స్టోరీలో నటిస్తోంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ఈ డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. మిగత భాగాన్ని శరవేగంగా పూర్తి చేస్తున్నారు.