విడాకులకు కారణాన్ని చెప్పిన సమంత.. మనం ఇప్పటికీ ఒక్కటే అని పోస్ట్

- Advertisement -

ఒకప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ లవ్ అబుల్ కపుల్ గా పేరు పొందారు సమంత ,నాగచైతన్య.. 2017లో అక్టోబర్ 7వ తేదీన వివాహ బంధంతో ఒక్కటే అయ్యారు. దీంతో ఈ జంటకు మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా పెరిగిపోయింది. అయితే ఆకస్మాత్తుగా తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించి ఒకసారిగా అభిమానులకు షాక్ ఇచ్చింది ఈ జంట.. 2021 లో పరస్పరా అంగీకారంతో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించడం జరిగింది. కానీ వీరు విడిపోవడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఇప్పటివరకు సామ్ మాత్రమే కొన్ని సందర్భాల్లో పరొక్షంగా డివోర్స్ గురించి స్పందించినప్పటికీ చైతూ మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక ఇటీవల కస్డడీ సినిమా ప్రమోషన్లలో భాగంగా విడాకులపై చైతూ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

సమంత
సమంత

తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన ఒక పోస్ట్ అందరిని ఆశ్చర్యాన్ని కలిగించేలా ఉంది తన ఇంస్టాగ్రాంలో మనమంతా ఒక్కటే కేవలం అహంకారం భయాలు మనమల్ని దూరం చేస్తాయి అంటూ ఒక కొటేషన్ ని షేర్ చేసింది. చైతన్య కామెంట్స్ కి సమంత ఇలా పోస్ట్ చేయడంతో ఇప్పుడు వీరిద్దరి కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. దీంతో వీరిద్దరికీ ఒకరంటే ఒకరికి అభిమానం గౌరవం ఉన్నాయని కానీ మధ్యవర్తుల కారణంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఈగోల వల్లే విడివిడిపోయారంటూ ఈ సందేశం తెలియజేస్తోంది. కేవలం సమంత ,చైతన్య మీద ఉండే ప్రేమతోనే ఇలా చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయం ఎందాక వెళ్తుందో చూడాలి మరి.

తాజాగా నాగ చైతన్య కూడా ఈ విషయంపై స్పందించారు. మేము విడిపోయి రెండేళ్లు అవుతోంది. చట్టప్రకారం విడాకులు తీసుకుని ఏడాది అవుతోంది. న్యాయస్థానం కూడా మాకు విడాకులు మంజూరు చేసింది. ప్రస్తుతం మేము మా జీవితాల్లో ముందుకు సాగిపోతున్నాం. జీవితంలోని ప్రతి దశను నేను గౌరవిస్తున్నాను. సమంత మంచి మనిషి.

- Advertisement -

ఆమె ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. నెట్టింట్లో వచ్చిన వదంతుల వల్లే మా మధ్య పరిస్థితులు ఇబ్బందికరంగా మారాయి. ఒకరిపై ఒకరికి గౌరవం లేనట్లు ప్రజల్లోకి వెళ్లింది. అదే నన్ను ఎంతో బాధపెట్టింది. అలాగే, ఈ మొత్తం వ్యవహారంలో మరో చెత్త విషయం ఏమిటంటే.. నా గతంతో సంబంధం లేని మూడో వ్యక్తిని ఇందులోకి లాగి వార్తలు రాయడం. దీనివల్ల ఆ మూడో వ్యక్తిని అగౌరవపరచినట్లు అయ్యింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here