Samantha : స్టార్ హీరోయిన్ సమంతకు తీవ్ర అస్వస్థత.. ఆందోళనలో ఫ్యాన్స్

- Advertisement -

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొద్ది కాలంగా ఆమె సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. తనకు ఇటీవల మయోసైటీస్ వ్యాధి రావడంతో పూర్తిగా అన్నింటికీ దూరమై ఇంట్లోనే ట్రీట్‌మెంట్ తీసుకుంటుంది. సమంత ఇప్పుడిప్పుడే మయోసైటీస్ వ్యాధి నుంచి కోలుకుంటూ మళ్లీ యాక్టివ్ అవుతుంది. అంతేకాకుండా సినిమాల్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు కూడా రెడీ అవుతోంది. మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తూ ఖాళీగా ఉండకుండా.. ఓ హెల్త్ పాడ్ కాస్ట్ స్టార్ట్ చేసి అందులో ఆరోగ్యానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను తెలుపుతుంది.

అంతేకాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన గ్లామర్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకునే ప్రయత్నంచేస్తుంది. హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో హీట్ పెంచుతోంది. తాజాగా సమంత తన పాడ్ కాస్ట్‌లో తనకు ఎదురైన ఓ అనుభవం తలుచుకొని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఇందులో భాగంగా న్యూట్రీషనిస్ట్ అల్కేశ్‌తో పలు విషయాలు పంచుకుంది. ‘‘ మయోసైటీస్ వ్యాధి వచ్చినప్పుడు వారంలో తగ్గుతుందనుకున్నాను. అలాగే నాకే ఎందుకు వచ్చిందని చాలా బాధపడ్డాను. ఏడాదిన్నరగా ఈ వ్యాధితో పోరాడుతున్నానంటే నేనే నమ్మలేకపోతున్నాను. కానీ దృఢంగా ఉంటే ఏదైనా సాధించగలం అని నిర్ణయించుకుని ధైర్యంగా పోరాడుతున్నాను.

- Advertisement -

ఈ విపత్కర సమస్యల నుంచి కోలుకోవడానికి ఏం చేయాలో తెలుసుకున్నాను. వాటిని ఇప్పటికీ పాటిస్తున్నాను. అలాగే సినిమాలకు బ్రేక్ ఇచ్చినందుకు సంతోషపడుతున్నాను. ఆరోగ్యం పరంగా చాలా హెల్ప్ అయింది. అయితే విజయ్ దేవరకొండతో ఖుషి సినిమా చేశాక వెంటనే బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న సిటాడెల్ వెబ్ సిరీస్‌కు సైన్ చేశాను. దీంతో షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలోనే కొన్ని యాక్షన్ సీన్స్ చిత్రీకరిస్తుండగా నొప్పులు, తిమ్మిరి వచ్చాయి. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై సృహ తప్పి అక్కడే పడిపోయాను. ఒక్కసారిగా షూట్ అంతా అప్సెట్ అయింది. మా టీమ్ వారు డాక్టర్‌కు కాల్ చేసి రప్పించి ట్రీట్మెంట్ ఇప్పించారు. అలాంటి పరిస్థితుల నుంచి బయటపడి షూటింగ్ పూర్తి చేశాను. ఇప్పుడు సిటాడెల్ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సమంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here