Samantha : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అగ్ర నటుల్లో సమంత ఒకరు. తన మనసులో మాటను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ మేరకు తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. ‘ఖుషి’ విడుదలకు ముందు తాను ఒత్తిడికి గురయ్యానని, రిలీజ్ తర్వాత ఎంతో ఆనందంగా ఉన్నానని తెలియజేస్తూ సంబంధిత ఫొటోలను షేర్ చేశారు. ‘ఖుషి’ సినిమాని మెచ్చిన వారందరికీ కృతజ్ఞతలు చెప్పారు.

‘ఇది ఎప్పుడూ సులభం కాదు.. జీవితాన్ని ఆసక్తికరంగా మార్చే కల నిజమయ్యే అవకాశమిది’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్‌పై పలువురు నెటిజన్లు, ఆమె అభిమానులు స్పందించారు. సినిమా హిట్ అంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం సమంత అమెరికాలో ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఆమె ఇండియాకు తిరిగిరానున్నారు. మరోవైపు, ‘అమెరికన్ ప్రొగ్రెసివ్ తెలుగు అసోసియేషన్’ డల్లాస్‌లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సమంత.. విదేశాల్లో స్థిరపడిన తెలుగు వారంతా భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ క్రమంలో విదేశాల్లో విడుదలయ్యే తెలుగు చిత్రాలనూ ఆదరించాలని కోరారు. విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రమిది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. విప్లవ్‌గా విజయ్, ఆరాధ్యగా సమంత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భిన్న నేపథ్యాలున్న ఈ ప్రేమజంట పెళ్లి తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది? అనే పాయింట్‌తో రూపొందిన ఈ సినిమాకి అన్ని చోట్ల మంచి టాక్ రావడంతో దర్శక, నిర్మాతలు హైదరాబాద్‌లో తాజాగా ప్రెస్‌మీట్ నిర్వహించి, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.