బాలీవుడ్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్(Salman Khan).. తాజాగా ఆప్ కీ అదాలత్ షోలో పాల్గొన్నాడు. అయితే తనకు పిల్లలు అంటే ఇష్టమని, కానీ ప్రస్తుతం ఉన్న భారతీయ చట్టాల ప్రకారం తాను తండ్రిని కాలేకపోతున్నట్లు వెల్లడించాడు. తల్లితండ్రుల పెళ్లి కోరికను తీర్చుతావా అని అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. మ్యారేజీ గురించి తనకు ఇంకా క్లారిటీ లేదని, కానీ తండ్రి కావాలన్న కాంక్ష ఉన్నట్లు సల్మాన్ తెలిపాడు. పిల్లలతో ఎక్కువ సమయం గడిపేందుకు ఇష్టపడతారు. దీని గురించి మీడియా ఒకసారి సల్మాన్‌ను అడిగితే.. తనకు పిల్లలు కావాలి కానీ, పెళ్లిపై క్లారిటీ లేదని చెప్పి షాక్ ఇచ్చారు.

సీనియర్ హీరోయిన్లు సంగీత బిజిలాని, సోమి అలీ నుంచి నెక్ట్స్ జనరేషన్‌లో ఐశ్వర్యరాయ్, కత్రినా కైఫ్ వరకు ఎంతో మంది హీరోయిన్లతో ఎఫైర్లు నడిపిన సల్లూ భాయ్.. ఎవరితోనూ బంధాన్ని నిలుపుకోలేకపోయాడని అంటుంటారు. ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఇటీవల సరోగసీ పద్ధతిలో కవలల్ని కన్న విషయం తెలిసిందే. దానికి గురించి సల్మాన్ ప్రస్తావిస్తూ. . అలాగే చేయాలని తాను కూడా ప్రయత్నిస్తున్నట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు చట్టం మారిందని, ఆ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు.

అలాగే తనకు ప్రేమ కలిసి రాదని చెప్పారు. కోస్టార్‌తో ఆయన ప్రేమలో ఉన్నారంటూ గత కొన్నిరోజుల నుంచి నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తన రిలేషన్‌షిప్ స్టేటస్‌పై సల్మాన్ ఖాన్ స్పందించారు. తనకు ప్రేమ కలిసిరాదని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రస్తుతానికి తాను అందరికీ భాయ్‌నే అని చెప్పిన సల్మాన్.. ‘‘నేను ఇష్టపడిన అమ్మాయి నన్ను జాన్ అని పిలిస్తే బాగుండు అని అనుకుంటాను. అయితే.. ఆమె కూడా నన్ను భాయ్ అనే పిలుస్తుంది. నేను ఏం చేసేది?’’ అని నవ్వులు పూయించారు. పూజాహెగ్డే – సల్మాన్ మధ్య రిలేషన్ మొదలైందంటూ వార్తలు వచ్చాయి. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియా కోడై కూసింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ పూజా స్పష్టం చేశారు.