కత్రీనా కైఫ్ భర్త విక్కీ కౌశల్ ని పక్కకి నెట్టేసిన సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్స్.. రీజన్ అదేనా !

- Advertisement -

బాలీవుడ్ భాయ్ జాన్ సల్మాన్ ఖాన్ కి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ప్రొఫెషనల్ కెరీర్ పరంగా తన నట‌నతో బాలీవుడ్ లో స్టార్ హీరో గా‌‌ కొనసాగుతున్నాడు సల్మాన్. పలు సినిమాలతో తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు. ఇక ఆయన పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే ఫిల్మ్ ఇండస్ట్రిలో కాదు బ్యాచిలర్ గా ఉండాలి అనుకునే వారందరికీ ఆయనొక ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. మన టాలీవుడ్ హీరోలు కూడా సల్మాన్ పెళ్లి అయ్యాక నేను పెళ్లి చేసుకుంటా అంటూ సరదాగా జోక్స్ వేస్తూ ఉంటారు.

విక్కీ కౌశల్
విక్కీ కౌశల్

అయితే ఐదు పదుల వయసు వచ్చినా కూడా పలు కారణాల వల్ల ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉండిపోయారు సల్మాన్. కానీ గర్ల్ ఫ్రెండ్స్ తో డేటింగ్ విషయంలో చాలాసార్లు వార్తల్లోకి ఎక్కాడు. ఈ మేరకు సల్మాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్ లో కత్రీనా కైఫ్ కూడా ఉన్నారు. కత్రినా కైఫ్ ని బాలీవుడ్ లో పరిచయం చేయడమే కాకుండా తనకి స్టార్ స్టేటస్ ని తీసుకు వచ్చింది సల్మాన్ ఖానే. వీరిద్దరి మధ్య ప్రేమలో ఉన్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. కానీ ఊహించని రీతిలో బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ ని ప్రేమించి.. పెళ్లి చేసుకుంది.

విక్కీ కౌశల్
విక్కీ కౌశల్

బాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో “ఉరి” మూవీతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు సల్మాన్ కారణంగా ఆయనకు ఒక చెడు అనుభవం జరగడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దుబాయ్ లో IIFA 2023 అవార్డ్స్ వేడుకలు జరుగుతున్నాయి. ఈ వేడుకలలో పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా పాల్గొని సందడి చేశారు. ఈ మేరకు విక్కీ కౌశల్‌ కూడా పాల్గొన్నాడు. అయితే విక్కీ కౌశల్‌ ఒక అభిమానికి సెల్ఫీ ఇస్తున్న సమయంలో సల్మాన్ ఖాన్ అటుగా నడుచుకుంటూ వచ్చాడు.

- Advertisement -

ఇక దారి మధ్యలో ఉన్న కౌశల్ ని సల్మాన్ బాడీ గార్డ్స్ హీరో అని కూడా పక్కకి నెట్టేశారు. కౌశల్ సీరియస్ అవ్వకుండా సల్మాన్ తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి, మాట్లాడడానికి ట్రై చేశాడు. కానీ సల్మాన్ తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వకపోగా.. కనీసం మాట్లాడకుండా వెళ్ళడం బీ టౌన్ లో సెన్సేషన్ గా మారింది. అలానే అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియో చూసిన నెటిజెన్స్ సల్మాన్ అండ్ అతడి బాడీ గార్డ్స్ నిందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా సల్మాన్ .. విక్కీ కౌశల్ విషయంలో కావాలనే ఇలా చేశారంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

   
vps230225.betterwebtechnologies.com telugucinematoday.com