షాకింగ్.. ఈ లేడీ కమెడియన్ శ్రీలక్ష్మి తండ్రి పెద్ద స్టార్ హీరో అనే విషయం ఎవరికైనా తెలుసా!

- Advertisement -

శ్రీలక్ష్మి టాలీవుడ్ లో లేడీ కమెడియన్స్ హవా అంతగా ఉండదు, అధిక శాతం మగవాళ్ల డామినేషన్ ఉంటుంది. అలాంటి డామినేషన్ ఉన్న రంగం లో కొంతమంది మహిళలు కమెడియన్స్ గా రాణించడం అంటే సాధారణమైన విషయం కాదు. అలాంటి వాళ్ళు మన ఇండస్ట్రీ లో కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. ఆ ఇద్దరు ముగ్గురులో ఒకరు శ్రీలక్ష్మి గారు.

శ్రీలక్ష్మి
శ్రీలక్ష్మి

ఈమె ముఖం ని చూసి గుర్తు పట్టని తెలుగు ఆడియన్స్ అంటూ ఎవ్వరూ ఉండరు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈమె నోటి నుండి వచ్చిన ‘బాబు చిట్టి’ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది. సోషల్ మీడియా లో ఇప్పటికీ మీమెర్స్ ఎదో ఒక సందర్భం లో ఈ డైలాగ్ ని వాడుతుంటారు. ఆంధ్ర ప్రదేశ్ లోని రాజముండ్రి లో పుట్టిన శ్రీలక్ష్మి తన బాల్యం మరియు విద్యాబ్యాసం మొత్తం చెన్నై లోనే చేసింది.

సినిమాల మీద మక్కువతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన ఈమెకి ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలే దక్కాయి,ఆ తర్వాత ఈమె సుమారుగా 500 సినిమాల్లో లేడీ కమెడియన్ గా నటించింది. ఇది ఇలా ఉండగా శ్రీలక్ష్మి తండ్రి అమర్ నాథ్ మరియు తమ్ముడు రాజేష్ ఇద్దరు కూడా సినీ నటులే. అమర్ నాథ్ గారు అప్పట్లో పెద్ద స్టార్ హీరో. ఎన్టీఆర్ మరియు ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలతో సరిసమానమైన ఇమేజి ని సంపాదించిన హీరో అట ఆయన.హీరో గా ఆయన సుమారుగా 100 సినిమాలు చేసాడట.

- Advertisement -

ఆయన హీరో గా నటించిన ‘అమర సందేశం’ మరియు ‘నా చెల్లెలు’ వంటి చిత్రాలు అప్పట్లో బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి. అలా వందకి పైగా సినిమాల్లో హీరో గా నటించిన ఈయనకి 1965 వ సంవత్సరం వచ్చేసరికి డిమాండ్ బాగా తగ్గిపోయింది, క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు చెయ్యొచ్చు కదా అని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తే, సమస్యే లేదు, హీరో గా వచ్చాను హీరోగానే పోతాను అని చెప్పాడట. ఆ తర్వాత కొన్ని చిత్రాలను నిర్మించి, సంపాదించినా డబ్బులు మొత్తం పోగొట్టుకొని, ఆ దిగులు తో జాండిస్ వచ్చి చనిపోయాడట. ఆయనకీ సంబంధించిన కొన్ని ఫోటోలు క్రింద అందిస్తున్నాము చూడండి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here