Salaar Movie : యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటించిన ‘సలార్ ‘ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలై మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ సినిమాకి ఇంత పాజిటివ్ టాక్ రావడం ఈ సినిమాకే జరిగింది. ప్రభాస్ కటౌట్ ని చాలా కాలం తర్వాత ఒక డైరెక్టర్ పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు అంటే అది ప్రశాంత్ నీల్ మాత్రమే అనే అభిప్రాయం అందరిలో కలిగింది.

రెండు తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్ లో కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ, ఇతర భాషల్లో ఈ సినిమాకి కనీస స్థాయి వసూళ్లు కూడా రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ముఖ్యంగా ప్రభాస్ కి బాగా కలిసొచ్చే బాలీవుడ్ లో కూడా ఈ సినిమాకి ఆశించిన స్థాయి ఓపెనింగ్ రాలేదని, ఆదిపురుష్ చిత్రం కంటే వరల్డ్ వైడ్ వసూళ్లు తక్కువ ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం చూస్తూ ఉంటే ఈ చిత్రానికి మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 120 నుండి 130 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని. హిందీ, తమిళ భాషల్లో కనీస స్థాయి వసూళ్లు వచ్చి ఉన్నా 150 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టి ఉండేదని, ఇప్పుడు ఆ ఛాన్స్ లేకపోవడం తో ఈ ఏడాది బంపర్ ఓపెనింగ్స్ దక్కించుకున్న లియో చిత్రం కంటే తక్కువ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

లియో చిత్రానికి మొదటి రోజు దాదాపుగా 147 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓపెనింగ్స్ లో అందుకోలేకపోయిన సలార్, కనీసం లాంగ్ రన్ లో అయినా అందుకుంటుందో లేదో చూడాలి అని ట్రేడ్ పండితులు కామెంట్స్ చేస్తున్నారు. లియో చిత్రం ఫుల్ రన్ లో 600 కోట్ల రూపాయిలను రాబట్టింది.. సలార్ కి మంచి పబ్లిక్ టాక్ ఉంది కాబట్టి లియో కలెక్షన్స్ ని కచ్చితంగా దాటుతుందని అంటున్నారు.