Salaar : ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ సలార్. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీ డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.చాలా రోజులుగా ఎంతో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాపై ఇప్పుడు కొత్త బజ్ క్రియేటైంది. ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కులు భారీ మొత్తానికి అమ్ముడైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి…ఈ భారీ బడ్జెట్ మూవీ.. మొదట్లో భారీగా వసూళ్లు సాధిస్తుందన్న నమ్మకంతో ఈ సినిమా హక్కులు కూడా భారీ స్థాయిలో అమ్ముడైనట్లు తెలుస్తోంది.
మొత్తంగా సలార్ హక్కులు తెలుగు రాష్ట్రాల్లోనే రూ.170 కోట్ల నుంచి రూ.175 కోట్ల వరకూ పలికినట్లు సమాచారం. నైజాం హక్కులు రూ.60 కోట్ల నుంచి రూ.65 కోట్ల వరకూ.. సీడెడ్ హక్కులు రూ.27 కోట్లకు.. ఆంధ్రా ప్రాంతంలో హక్కులు రూ.80 కోట్ల నుంచి రూ.85 కోట్ల వరకూ పలికినట్లు బజ్ క్రియేటైంది. సినిమాపై ఉన్న అంచనాల నేపథ్యంలో హక్కులు భారీ ధర పలికాయి. అయితే ఈ మొత్తం వసూలై.. డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్లాలంటే మాత్రం సలార్ బాక్సాఫీస్ దగ్గర అద్భుతం క్రియేట్ చేయాల్సి ఉంటుంది.
బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వస్తేనే అది సాధ్యమవుతుంది. అంతేకాదు తొలి షో నుంచే కాస్తయినా పాజిటివ్ టాక్ రావడం కూడా ఎంతో ముఖ్యం.అందులోనూ షారుక్ ఖాన్ డంకీ మూవీతో సలార్ పోటీ పడబోతోంది. నార్త్ ఇండియాలో షారుక్ ఖాన్ కి ఉన్న క్రేజ్ కారణంగా అక్కడ డంకీని కాదని సలార్ వైపు ప్రేక్షకులు మొగ్గు చూపరని తెలుస్తుంది.అందువల్ల మేకర్స్ తెలుగు రాష్ట్రాలపైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. అటు ప్రశాంత్ నీల్ సొంత రాష్ట్రం కర్ణాటకలోనూ సలార్ రాణిస్తేనే ఈ సినిమా భారీ లాభాల్లోకి వెళ్తుంది. మరోవైపు ఈ లెక్కలన్నీ దొంగ లెక్కలనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.