Salaar : ‘సలార్’ మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 22న పాన్ ఇండియా స్థాయిలో గ్రాండ్ గా విడుదలై బ్లాక్ బాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. సౌత్, నార్త్ అనే తేడా లేకుండా అన్నిచోట్ల భారీ వసూళ్లను అందుకుంటోంది. మొదటి రోజే వరల్డ్ వైడ్ గా రూ.178 కోట్ల గ్రాస్‌ని అందుకొని 2023లోనే అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న చిత్రంగా సరికొత్త రికార్డును క్రియేట్ చేసిన ఈ సినిమా ప్రస్తుతం అన్ని వర్గాల ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
హై వోల్టేజ్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన సలార్ మూవీతో ప్రభాస్ భారీ కం బ్యాక్ అందుకున్నారు. అయితే ఈ సినిమాలో ప్రభాస్, పృధ్విరాజ్ చిన్ననాటి పాత్రల్లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్స్ మంచి నటనను కనబరిచి ఒక్కసారిగా పాపులర్ అయిపోయారు. తాజాగా సలార్‌లో పృధ్విరాజ్ చిన్ననాటి పాత్రలో కనిపించిన చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ దేవ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంటూ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించాడు.
ఈ ఇంటర్వ్యూలో సలార్ తో పాటు తనకు మరో సినిమాలోనూ ఛాన్స్ వచ్చిందని చెప్పాడు.” ప్రస్తుతం నేను పదో తరగతి చదువుకుంటున్నాను. మా సొంతూరు ప్రకాశం జిల్లా. కొన్నాళ్ల క్రితమే హైదరాబాదులో సెటిల్ అయ్యాము. ఓ కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా నాకు సలార్ ఆడిషన్స్‌కు వెళ్లే ఛాన్స్ వచ్చింది. ఆ ఆడిషన్స్‌కు చాలా మంది వచ్చారు. అయితే నా యాక్టింగ్ నచ్చి ప్రశాంత్ నీల్ ఇందులో ఛాన్స్ ఇచ్చారు. ఆయనతో పాటు సలార్‌లో నా యాక్టింగ్ చూసి పృధ్విరాజ్ తన నెక్స్ట్ మూవీలో ఆఫర్ కూడా ఇచ్చారు. లూసిఫర్ సీక్వెల్లో పృధ్విరాజ్ చిన్నప్పటి పాత్రకు నన్ను సెలెక్ట్ చేశారు” అని చెప్పుకొచ్చాడు కార్తికేయ.