సైంధవ్ సినిమాలో విలన్ గా స్టైలిష్ హీరో

- Advertisement -

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా సినిమాకు డిఫరెంట్ కథలను ఎంచుకుంటూ హిట్స్ సాధిస్తూ విక్టరీనే ఇంటి పేరుగా మార్చుకున్నారు. ఇటు కామెడీ అటు సీరియస్ ఏ పాత్రలోనైనా ఒదిగిపోయి ప్రేక్షకులను ఔరా అనిపిస్తుంటారు వెంకటేశ్. ఇటీవల ట్రెండ్ మార్చి ఎక్కువగా మల్టీ స్టారర్ సినిమాలు చేస్తూ విజయాలను సాధిస్తున్నారు. సరికొత్త కథాంశంతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా అవసరమైతే.. పలు భాషలో సూపర్ హిట్ సాధించిన సినిమాలను తెలుగులోని అనువదించి విజయాలను అవలీలగా అందుకుంటున్నారు.

ఇటీవల కాలంలో స్టార్ హీరోలంతా యాక్షన్ ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా వెంకటేశ్ నటిస్తున్న హై వోల్టేజ్ యాక్షన్ చిత్రం సైంధవ. ఈ మధ్య యాక్షన్ సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభిస్తోంది. ఇలాంటి కథలకు మంచి డిమాండ్ ఉండడంతో హీరోలంతా ప్రస్తుతం వాటిపైనే మక్కువ చూపుతున్నారు. ఇటీవల వచ్చిన కమలహాసన్ విక్రమ్, రజినీకాంత్ జైలర్ సినిమాలు ఇదే విషయాన్ని ప్రూవ్ చేశాయి. కాగా ఇప్పుడు వెంకటేష్ కూడా సైంధవ అనే ఒక యాక్షన్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.

ఈ సినిమాలో దిగ్గజ నటులు చాలామంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సైంధవ.. విక్టరీ వెంకటేశ్ కెరీర్లో 75వ సినిమా. ఇందులో హీరోయిన్ గా రుహాని శర్మ నటిస్తోంది. ఈ సినిమాలో ఇప్పటి వరకు ఎనిమిది మంది స్టార్స్ నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ ఏడుగురిని పరిచయం చేసిన చిత్రబృందం తాజాగా ఎనిమిదో పాత్రను కూడా రివీల్ చేసింది. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య కూడా చిత్రంలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. సినిమాలో ఆర్యకు సంబంధించి లుక్ ని కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ పోస్టర్లో ఆర్య ఆల్ట్రా మోడ్రన్లో చాలా టెర్రిఫిక్ గా కనిపిస్తున్నారు. సినిమాలో ఆర్య పోలీస్ ఆఫీసర్ లేకపోతే విలన్ పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here