Sai Pallavi : హీరోల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తున్న సాయిపల్లవి

- Advertisement -


Sai Pallavi : ఫిదా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ సాయి పల్లవి అందరికీ సుపరిచితమే. లేడీ పవర్ స్టార్ అనే ట్యాగ్ కూడా అందుకుంది ఈ క్యూటీ. కథ నచ్చితే ఎలాంటి పాత్రలోనైనా నటించేందుకు ఈ బ్యూటీ రెడీ. పలు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి చేతిలో మూడు సినిమాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Sai Pallavi
Sai Pallavi

ఒకటి కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్‌తో కలిసి రామాయణ్ అనే చిత్రంలో నటిస్తోంది. దాంతో పాటు నాగ చైతన్య సరసన తండేల్ లో కూడా నటిస్తోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన లవ్‌స్టోరీ సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ సినిమా గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై దర్శకుడు చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ సినిమా కోసం సాయి పల్లవి భారీగా డిమాండ్ చేస్తోందని సమాచారం.

Naga chaitanya Sai Pallavi

ప్రస్తుతం హీరోయిన్లు కూడా హీరోలకు దీటుగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. పాత్రను బట్టి హీరోయిన్లు రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. తండేల్ సినిమా కోసం సాయి పల్లవి దాదాపు 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తోందని తెలుస్తోంది. మరి నిర్మాతలు సాయి పల్లవి అడిగినంత ఇస్తారా అని కూడా అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ సినిమాతో సాయి పల్లవి ఈసారి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here