Extra – Ordinary Man మూవీ మొట్టమొదటి రివ్యూ.. కామెడీ మామూలు రేంజ్ లో వర్కౌట్ అవ్వలేదు!

- Advertisement -

Extra – Ordinary Man : యూత్ మరియు లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కుర్ర హీరోల లిస్ట్ తీస్తే అందులో నితిన్ కచ్చితంగా ఉంటాడు. కానీ ఈయనకి ‘భీష్మ’ చిత్రం తర్వాత సరైన సక్సెస్ లేదు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ‘మాచెర్ల నియోజకవర్గం’ చిత్రం పెద్ద ఫ్లాప్ అయ్యింది.

Extra - Ordinary Man
Extra – Ordinary Man

దీంతో నితిన్ తన తదుపరి చిత్రం ఎలా ఉండబోతుందో, ఈసారి కూడా హిట్ కొట్టకపోతే స్లంప్ ఫేస్ కి వెళ్తాడు అని అనుకుంటున్నా సమయం లో తనకి ఎంతగానో కలిసొచ్చిన ఎంటర్టైన్మెంట్ జానర్ ని ఎంచుకొని ‘ఎక్స్‌ట్రా – ఆర్డినరీ మేన్’ అనే సినిమా చేసాడు. ఈ చిత్రం వచ్చే నెల 8 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది. రీసెంట్ గానే విడుదల చేసిన ట్రైలర్ కి ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. నితిన్ గాడిలో పడ్డాడు, ఇక సూపర్ హిట్ కొట్టడం పక్కా అని అందరూ అనుకున్నారు.

Nithiin

రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన ప్రివ్యూ షో ని ప్రసాద్ ల్యాబ్స్ లో కొంతమంది సినీ ప్రముఖులు మరియు మీడియా మిత్రుల సమక్షం లో స్పెషల్ షో ని ఏర్పాటు చేసారు. ఈ షో నుండి ఈ చిత్రానికి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఫన్ అదిరిపోయిందని, సెకండ్ హాఫ్ లో కాస్త ల్యాగ్ అనిపించినా కూడా, చివరి 45 నిమిషాలు వర్కౌట్ అయ్యిందని, కచ్చితంగా ఈ సినిమా నితిన్ కెరీర్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అంటున్నారు.

- Advertisement -
Extra - Ordinary Man Movie

ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో కామెడీ చాలా బాగా వర్కౌట్ అయ్యిందట. ప్రేక్షకులు చాలా కాలం తర్వాత కడుపుబ్బా నవ్వుకునే సినిమాగా ఇది నిలుస్తుందని అంటున్నారు. ఈ రిపోర్ట్స్ కి తగ్గట్టుగా సినిమా ఉంటుందో లేదో తెలియాలంటే మరో పది రోజులు ఆగాల్సిందే. ఈ చిత్రం లో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, సీనియర్ హీరో రాజశేఖర్ ఒక ముఖ్య పాత్ర పోషించాడు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here