Amar Deep : ‘టికెట్ టు ఫినాలే’ రేస్ లో అత్యధిక పాయింట్స్ ని దక్కించుకున్న అమర్ దీప్.. ప్రియాంక ని విసిరి పాడేశాడుగా!

- Advertisement -

Amar Deep : నిన్న గాక మొన్ననే మొదలైనట్టు అనిపించిన బిగ్ బాస్ సీజన్ 7 అప్పుడే క్లైమాక్స్ కి వచ్చేసింది. 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ బిగ్ బాస్ హౌస్ లో చివరికి 8 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో ఎవరు ఫైనల్స్ కి వెళ్లారు అనేది ఇప్పుడు ఉత్కంఠ ని కలిగించే విషయం. అమర్ దీప్, శివాజీ మరియు పల్లవి ప్రశాంత్ కచ్చితంగా టాప్ 5 లో ఉంటారు. వీళ్ళ తర్వాత ఎవరు రేస్ లోకి వస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.

Amar Deep
Amar Deep

ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ‘టికెట్ టు ఫినాలే’ టాస్కు జరుగుతుంది. పవర్ అస్త్ర లాగానే దీనికి ఫైనల్ అస్త్ర అని పేరు పెట్టారు. టాస్కులు మొదలయ్యాయి. ఈ సీజన్ మొత్తం అందరూ కెప్టెన్స్ అయ్యారు కానీ, అమర్ దీప్ మాత్రం అవ్వలేదు. రెండు సార్లు అయ్యే అవకాశాలు వచ్చినా నమ్మినవాళ్ళే వెన్నుపోటు పొడవడం తో కెప్టెన్ అవ్వలేకపోయాడు.

Amar Deep Bigg Boss

అందుకే ఈ వారం ఎలా అయినా ‘ఫైనల్ అస్త్ర’ ని గెలుచుకునేందుకు అమర్ దీప్ తన వైపు నుండి నూటికి నూరు శాతం కృషి చేస్తున్నాడు. మొదటి రౌండ్ లో టాప్ 3 స్థానం లోకి వచ్చాడు, రెండవ రౌండ్ లో ఓడిపోయాడు కానీ, తన వైపు నుండి ఎఫ్ర్ట్స్ మాత్రం బాగానే పెట్టాడు. ఇక ఫ్లవర్స్ టాస్క్ లో శివాజీ మరియు శోభా శెట్టి ఓడిపోవడం తో తమ దగ్గర ఉన్న పాయింట్స్ ని అమర్ దీప్ కి ఇచ్చారు.

- Advertisement -

అందువల్ల అమర్ దీప్ అందరికంటే అత్యధిక పాయింట్స్ తో టాప్ 1 స్థానం లో నిలిచాడు. దాదాపుగా 360 పాయింట్స్ ఆయనకీ వచ్చాయి. అయితే అంత పాయింట్స్ ఉన్నప్పటికీ కూడా ప్రియాంక తో ఒక రేంజ్ లో కలబడి ఆడి ఆమెని లాగి అవతల పడేసాడు. దీనిని సోషల్ మీడియాలో నెటిజెన్స్ తీసుకోలేకపోయారు. అమ్మాయి పట్ల అలా ప్రవర్తించడం తప్పు కదా అని అంటున్నారు. కానీ అది ఫిజికల్ టాస్క్ కాబట్టి ఆడక తప్పదు, ఆడకపోతేనే తప్పు అని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here