Sai Pallavi లిప్ కిస్ ఇచ్చిన ఒకే ఒక్క హీరో ఎవరో తెలుసా..

- Advertisement -

Sai Pallavi : తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం స్టార్ హీరోయిన్స్ సంఖ్య చాలానే ఉంది. కానీ వారిలో ఎవరైనసారే ఒక్క ఫ్లాప్ ఎదుర్కొంటే మళ్లీ మరో హిట్టు కొడితే గానీ ఫామ్ లోకి రారు. అంతేకాకుండా వరుసగా రెండు ఫ్లాప్స్ వస్తే చాలు ఐరన్ లెగ్ గా ముద్ర వేస్తారు. కానీ కొంతమంది హీరోయిన్స్ మాత్రం సక్సెస్, ఫెయిల్యూర్ తో ఎలాంటి సంబంధం లేకుండా, గ్లామర్ కు తావివ్వకుండా దూసుకుపోతుంటారు. అలాంటి వారిలో ఫస్ట్ గా చెప్పుకునేది సాయి పల్లవి గురించి. ఇటీవల వరుసగా శ్యామ్ సింగరాయ్, విరాట పర్వం, గార్గి సినిమాలతో అలరించింది. అయితే చాలా పద్ధతిగా ఉండే సాయిపల్లవి ఒకే ఒక్క హీరోకు లిప్ కిస్ ఇచ్చింది.

Sai Pallavi
Sai pallavi

శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఫిదా సినిమాతో సాయి పల్లవి ఏ రేంజ్ లో క్రేజ్ అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఆ సినిమా సక్సెస్, సాయి పల్లవి నటన చూసిన తర్వాత ఆమెతో ఎలాగైన మూవీ చేయాలని స్టార్ దర్శకులు కూడా ఓపెన్ గానే స్టేజ్ లపై చెప్పేశారు. కానీ సాయి పల్లవి మాత్రం తన వద్దకు వచ్చేవారు స్టార్ దర్శకులా చిన్న దర్శకులా అని తేడా చూపించలేదు. పైగా డ్రెస్సింగ్ విషయంలోనూ సాయి పల్లవి చాలా పద్ధతిగా ఉంటుంది. అందుకే సినీ రంగంలో చాలామంది ఆమెతో చేయాలని ఆరాట పడుతుంటారు.

Naga Chaitanya sai pallavi

అయితే సాయి ప‌ల్ల‌వి త‌న సినీ కెరీర్ లో ఒకే ఒక్క హీరోకి లిప్ కిస్ ఇచ్చింది. ఇంత‌కీ ఆ అదృష్ట‌వంతుడు ఎవ‌రో తెలుసా.. యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌(Naga Chaitanya). నాగ‌చైత‌న్య‌, సాయి ప‌ల్ల‌వి జంట‌గా ల‌వ్ స్టోరీ(Love Story) మూవీలో న‌టించారు. శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. అయితే ఓ స‌న్నివేశంలో కంటెంట్ డిమాండ్ చేయడం వ‌ల్ల సాయి ప‌ల్ల‌వి తొలిసారి త‌న రూల్స్ ను బ్రేక్ చేసి హీరో నాగ చైత‌న్యకు లిప్ కిస్ ఇచ్చింది. అయితే ఆ సీన్ సినిమాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. పైగా సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ గా కూడా నిలిచింది.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here