Sai Pallavi : ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోయిన్స్ లో ఆల్ రౌండర్ అనిపించుకున్న అతి కొద్దిమందిలో ఒకరు సాయి పల్లవి.ఫిదా సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైనా ఈమె తోలి సినిమాతోనే సెన్సేషనల్ హిట్ కొట్టి యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ దక్కించుకుంది.ఈమెని అందరూ లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తుంటారు.ఎందుకంటే మగవాళ్ళతో పవన్ కళ్యాణ్ ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో, అలాంటి ఫాలోయింగ్ ఆడవాళ్ళలో సాయి పల్లవి కి ఉందంటారు.
ఫిదా, MCA , లవ్ స్టోరీ , శ్యామ్ సింగ రాయ్ వంటి సూపర్ హిట్స్ తో ఇండస్ట్రీ లో నాటుకుపోయిన సాయి పల్లవి గత కొంతకాలం గా సినిమాలకు దూరం గా ఉంటూ వస్తుంది.ఆమె హీరోయిన్ గా నటించిన చివరి చిత్రం ‘విరాటపర్వం’.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.ఇక ఆ తర్వాత నుండి ఈమె స్క్రిప్ట్స్ విషయం లో చాలా జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి అనే ఉద్దేశ్యంతో గ్యాప్ ఇచ్చింది.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా ఈమె చాలా కాలం తర్వాత సోనీ లివ్ అనే ఓటీటీ యాప్ లో ప్రసారమవుతున్న ‘నిజం విత్ స్మిత’ టాక్ షో లో పాల్గొన్నది.ఈ టాక్ షో లో ఆమె కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది.ఇండస్ట్రీ లో నెలకొన్న కాస్టింగ్ కౌచ్ మరియు ఆడవాళ్ళ పై లైంగిక వేధింపుల గురించి అడిగిన ప్రశ్నలకు సాయి పల్లవి ఇచ్చిన సమాదానాలు అద్భుతంగా ఉన్నాయి.
ఆమె మాట్లాడుతూ ‘ప్రపంచం లో ఉన్న ప్రతీ స్త్రీ లైంగిక వేధింపులకు గురి అయ్యినదే. అది కేవలం శారీరకంగా మాత్రమే కాదు, మాటలతో మానసికంగా వేధించే క్రియని కూడా లైంగిక దాడిగానే పరిగణిస్తారు. మా అమ్మ కూడా అలాంటి లైంగిక దాడులకు గురైన ఆమెనే, మా చెల్లి మరియు మా భామ కూడా అలాంటి వేధింపులకు గురి అయ్యినవాళ్ళే’ అంటూ సాయి పల్లవి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి.