Rules Ranjan First Review .. కిరణ్ అబ్బవరం ఈసారి సిక్సర్ కొట్టబోతున్నాడా?

- Advertisement -

Rules Ranjan First Review : ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి, అతి తక్కువ సమయం లోనే మంచి గుర్తింపుని దక్కించుకున్న హీరోలలో ఒకడు కిరణ్ అబ్బవరం. చేతిలో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగం ని వదిలేసి, సినిమాల మీద పిచ్చి తో ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాడు. తొలి సినిమా ‘రాజావారు రాణివారు’ చిత్రానికి మంచి పాజిటివ్ రివ్యూస్ వచ్చినప్పటికీ, టాక్ సరిగా జనాల్లోకి వెళ్ళకపోవడం వల్ల పెద్దగా సక్సెస్ కాలేదు.

Rules Ranjan First Review
Rules Ranjan First Review

ఆ తర్వాత ‘SR కల్యాణమండపం’ చిత్రం పెద్ద హిట్ అవ్వడం తో కిరణ్ అబ్బవరం పేరు ఇండస్ట్రీ లో బలంగా వినిపించింది. ఈ సినిమా తర్వాత పలు సూపర్ హిట్స్ వచ్చాయి, ఫ్లాప్స్ వచ్చాయి. కానీ కిరణ్ అబ్బవరం మార్కెట్ మాత్రం పెరగలేదు. ఇప్పుడు ఆయన లేటెస్ట్ గా ‘రూల్స్ రంజన్’ అనే సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. అక్టోబర్ 6 వ తేదీన విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రివ్యూ షో ని ప్రసాద్ ల్యాబ్స్ లో కాసేపటి క్రితమే ప్రదర్శించారు. టాక్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.

Kiran Abhavaram

రూల్స్ రంజన్ చిత్రం ఎంటర్టైన్మెంట్ పరంగా ఈమధ్య వచ్చిన సినిమాలలో ది బెస్ట్ అని అంటున్నారు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా సమపాళ్లలో ఉన్నాయని, ఇది కిరణ్ అబ్బవరం కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పాటలలో ‘సమ్మోహనుడా’ అనే పాట యూట్యూబ్ లో బాగా క్లిక్ అయ్యింది. టీజర్ మరియు ట్రైలర్ కూడా ప్రేక్షకులకు బాగా నచ్చింది.

- Advertisement -
Kiran abhavaram neha shetty

‘వినరో భాగ్యము విష్ణు కథ’ చిత్రం తో సూపర్ హిట్ ని అందుకున్న కిరణ్ అబ్బవరం, ‘మీటర్’ చిత్రం తో డిజాస్టర్ ఫ్లాప్ ని అందుకున్నాడు. ఇప్పుడు ఆయనకీ కచ్చితంగా భారీ బ్లాక్ బస్టర్ హిట్ కావాలి, అది రూల్స్ రంజన్ యే అవుతుందని బలమైన నమ్మకం తో చెప్తున్నారు ఈ సినిమా ప్రివ్యూ షో చూసిన వారు. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here