రుహానీ శర్మ.. చేసింది కొన్ని సినిమాలే అయినా గుర్తుండి పోయే పాత్రలతో అలరించింది. ఈమధ్య కాస్త ఎక్కువ గ్యాప్ తీసుకున్న ఈ భామ తాజాగా సైంధవ్ సినిమాతో వస్తోంది. ఇక ఈ మధ్య ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది. తరచూ ఫొటోషూట్స్ చేస్తూ తన ఫొటోలతో అభిమానులను అలరిస్తోంది. తాజాగా రుహానీ షేర్ చేసిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

తాజాగా రుహానీ గ్రీన్ కలర్ ఔట్ఫిట్లో ఫొటోలు షేర్ చేసింది. గ్రీన్ క్రాప్ టాప్లో ఈ బ్యూటీ బోల్డ్ లుక్స్తో అదరగొట్టింది. క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్లను టెంప్ట్ చేసింది. తన హాట్ హాట్ అందాలతో నెట్టింట సెగలు పుట్టించింది. రోజురోజుకు బోల్డ్ ఔట్ఫిట్స్తో అంతకు మించిన ఘాటు పోజులతో రుహానీ కుర్రాళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

సుశాంత్ ‘చిలసౌ’ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది రుహానీ శర్మ. ఆ తర్వాత విశ్వక్ సేన్ సరసన ‘హిట్’ సినిమాలో నటించింది. ఆ మూవీ ఎంత భారీ హిట్ కొట్టిందో అందరికీ తెలిసిందే. ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’ సినిమాలతో పాటు ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘మీట్ క్యూట్’ ఆంథాలజీలోనూ రుహాని నటించి మెప్పించింది. ఈ బ్యూటీ తన కెరీర్ మొదటి నుంచి డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తోంది.

ఈ సినిమాల తర్వాత ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘హర్’ (HER)లోనూ ఆమె నటించింది. సస్పెన్స్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్రంలో రుహాని.. ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించింది. ఈ చిత్రంలో తన అందం, అభినయంతో మరోసారి ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక తాజాగా ఈ బ్యూటీకి హిట్ డైరెక్టర్ శైలేష్ మరోసారి తన సినిమా ‘సైంధవ్’లో ఛాన్స్ ఇచ్చారు.

శైలేష్ కొలను దర్శకత్వం వహించిన సైంధవ్ చిత్రంలో డా.రేణుగా ఆమె నటిస్తున్నట్లు రుహాని ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో రుహాని మెడలో స్టెతస్కోప్తో క్యాజువల్ డ్రెస్సులో డాక్టర్ పాత్రలో కనిపిస్తూ, గంభీరంగా చూస్తోంది. తాజాగా రివీల్ అయిన రుహాని పాత్ర సినిమాపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.