ఆంటీ లాగ తయారైనా ‘యజ్ఞం’ మూవీ హీరోయిన్.. చూస్తే గుర్తుపట్టలేరు!

- Advertisement -

వరుసగా విలన్ రోల్స్ చేస్తూ ఒక్కసారిగా హీరో గా మారి గోపీచంద్ చేసిన చిత్రం ‘యజ్ఞం’.అప్పట్లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. 2004 వ సంవత్సరం లో ప్రభాస్ హీరో గా నటించిన ‘వర్షం’ చిత్రం లో విలన్ గా చేసిన గోపీచంద్, అదే సంవత్సరం లో హీరో గా మారి యజ్ఞం తో సూపర్ హిట్ ని అందుకున్నాడు.

సమీరా బెనర్జీ
సమీరా బెనర్జీ

ఈ సినిమా తర్వాత ఆయన మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇండస్ట్రీ లోనే పెద్ద మాస్ హీరో గా ఆయన ఎదిగిన తీరు ప్రతీ ఒక్కరికి తెలుసు. ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సమీరా బెనర్జీ అలియాస్ మూన్ మూన్ బెనర్జీ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. తొలిసినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఆమె,ఈ చిత్రం తర్వాత మళ్ళీ ఎలాంటి సినిమాలో కూడా కనిపించకపోవడం విశేషం.

Sameera Banerjee

ఇందులో ఆమె కేవలం అందం పరంగా మాత్రమే , నటన పరంగా కూడా చిరకాలం గుర్తుంచుకునే పాత్రలో నటించింది. అయినా కానీ డైరెక్టర్స్ ఈమె వైపు ఎందుకు చూడలేదు అనేది అర్థం కాదు. సినిమాల్లో ఈమె ఎక్కువగా కనిపించకపోవచ్చు కానీ, బాలీవుడ్ సీరియల్స్ లో మాత్రం ఈమె మంచి పాపులారిటీ ని దక్కించుకుంది. ‘ఛష్మీ బదూర్’ అనే తెలివిజం సీరియల్ ద్వారా 1998 వ సంవత్సరం లో ఈమె అరంగేట్రం చేసింది.ఆ తర్వాత ఈమె వరుసగా 25 కి పైగా సీరియల్స్ లో నటించాడు.

- Advertisement -
Sameera Banerjee gopi chand

మధ్యలో 2004 వ సంవత్సరం లో గోపీచంద్ ‘యజ్ఞం’ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. ఇక సీరియల్స్ లో ఈమె కేవలం హీరోయిన్ రోల్స్ మాత్రమే కాదు, నెగటివ్ రోల్స్ కూడా చాలానే చేసింది. ప్రస్తుతం ఈమె కలర్స్ టీవీ లో ప్రసారం అవుతున్న ‘ససురాల్ సీమర్ కా 2’ అనే సీరియల్ లో నటిస్తుంది. ‘యజ్ఞం’ సినిమాలో అంత క్యూట్ గా కనిపించిన ఈమె, ఇప్పుడు ఆంటీ లాగ మారిపోయింది, ఆమె లేటెస్ట్ లుక్స్ చూస్తే ఆశ్చర్యపోతారు, క్రింది ఫోటోలలో మీరే చూడండి.

Sameera Banerjee photos

Publisher : Telugu Cinema Today
Publication : Telugu Cinema

latest articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here